ఒంగోలు నుంచి వచ్చాం.. పేరు నిలబెట్టాలి అని చిరంజీవికి చెప్పిన మాదాల రంగారావు!
రెడ్ స్టార్ మాదాల రంగారావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. రంగారావు భౌతిక కాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ రంగారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తన కెరీర్ ఆరంభంలో ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి మాదాల రంగారావు అని చిరు అన్నారు. తామంతా ఒంగోలులో చదువుకునే రోజులనుంచి పరిచయస్తులం అని చిరంజీవి అన్నారు. చెన్నైకి వెళ్ళాక రంగారావు తనని ప్రోత్సహించిన విధానాన్ని మరిచిపోలేమని చిరు అన్నారు.

మనమంతా ఒంగోలు నుంచి చదువుకుని వచ్చాం. పేరు నిలబెట్టాలి అని తనని ప్రోత్సహించని మాదాల రంగారావు మాటలు ఎప్పటికి మరచిపోలేనని అన్నారు. కమర్షియల్ చిత్రాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన విప్లవాత్మక చిత్రాలనే ఎంచుకుని ఆర్ నారాయణమూర్తి వంటి నటులకు స్ఫూర్తిగా నిలిచారని చిరు తెలిపారు. మాదాల రంగారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యలకు ప్రఘాడ సానుభూతి తెలియజేసారు.


Click it and Unblock the Notifications











