గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు

ప్రముఖ రచయిత, నటుడు, సాహితీ వేత్త అయిన గొల్లపూడి మారుతీరావు మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన గురువారం (డిసెంబర్ 12) కన్నుమూశారు. ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలను ఆదివారం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ప్రజల సందర్శానార్థం..

ప్రజల సందర్శానార్థం..

శనివారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి మార్చురీలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భౌతికకాయాన్ని... చెన్నైలోని... టి.నగర్‌ శారదాంబాళ్‌ వీధిలోని ఆయన ఇంటికి తీసుకొచ్చి... ప్రజల సందర్శన కోసం ఉంచారు. నటులు భానుచందర్‌, సుహాసిని, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రాజీవ్‌మేనన్‌, సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ మురారి, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఇంకా చాలా మంది గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

చైన్నై వెళ్లిన చిరు..

చైన్నై వెళ్లిన చిరు..

గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు, అంతిమ యాత్రలో పాల్గొనేందుకు చిరంజీవి శనివారం చెన్నైకి బయల్దేరారు. తమది గురు శిష్యుల బంధమని చెప్పుకునే చిరు.. తీవ్ర భావోద్వేగానిక లోనయ్యాడు. చెన్నై టీనగర్‌లోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అది నా దురృష్టం..

అది నా దురృష్టం..

అనంతరం చిరు మాట్లాడుతూ.. 1979లో తమ పరిచయం జరిగిందని తెలిపాడు. ఆఖరి సారి ఆయను కుమారుడి పేరు మీదిచ్చే అవార్డు ఫంక్షన్‌కు రావాలని పిలిచారని, అదే చివరిసారి ఆయన్ను చూడటమని తెలిపాడు. మళ్లీ ఇలా చూడటం తన దురదృష్టమని ఆవేదన చెందాడు.

శిష్యరికం చేశాను..

శిష్యరికం చేశాను..

నేను అప్పట్లో ఐ లవ్యూ అనే చిత్రం చేస్తున్నప్పుడు గొల్లపూడి దగ్గర డైలాగ్‌లను ఎలా చెప్పాలో నేర్చుకోమ్మని నిర్మాత సలహా ఇచ్చాడు. అలా ఆయన దగ్గర కొన్ని రోజులు శిష్యరికం చేశానని తెలిపాడు. అయితే నటుడిగా మాత్రం తన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో పరిచయం అయ్యారని, అటుపై ఎన్నో చిత్రాల్లో కలిసి నటించామని తెలిపాడు. ఆయన ఇంటికి వస్తే ఎన్నో మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నాయని, ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X