కేరళలో చిరంజీవి ప్రత్యేక పూజలు, అందుకేనా?

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కేరళలో ఉన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన 150వ సినిమా మొదలు పెట్టనున్న నేపథ్యంలో శుభం జరుగాలని చిరంజీవి ఈ పూజలు చేయించినట్లు సమాచారం.

అప్పుడెప్పుడో చిరంజీవి పుట్టినరోజు నాడే ఆయన 150వ సినిమా వివరాలు చెబుతామన్నారు. కానీ వాయిదా వేసారు. మరింత జాప్యం చేస్తూ వస్తున్నారు. ఈ జాప్యానికి కారణమేంటో తెలిసి పోయింది. ఆ మధ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేపాల్ లోని పుశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ఆలయ పండితులు ఓ విషయం సూచించారట. ఏ కొత్త ప్రాజెక్టు అయినా కార్తీక మాసం తర్వాత అంటే నవంబర్ తర్వాతే మొదలు పెట్టాలని సూచించారట.

Chiranjeevi performing special poojas in Kerala

150వ చిత్రాన్ని ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి తనకు సూటయ్యే, అభిమానులకు నచ్చే స్టోరీ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వివిధ స్టోరీలను పరిశీలిస్తున్నారు. త్వరలో ఏదో ఒక స్టోరీ ఫైనల్ కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి పరిశీలనలో ఉన్న స్టోరీల్లో దర్శకుడు గుణశేఖర్ రెడీ చేసిన స్టోరీ కూడా ఉందట. చిరంజీవి పార్టీ పెట్టకముందు గుణశేఖర్ ఈ స్టోరీ రెడీ చేసుకున్నారట. అయితే ఆయన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత గుణశేఖర్ వరుడు సినిమాతో బిజీ అయిపోగా, చిరంజీవి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

అయితే అప్పుడు గుణశేఖర్ చిరంజీవి కోసం తయారు చేసిన స్టోరీ కూడా ఇప్పుడు 150 సినిమా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏ విషయం అనేది ఖరారు కానుంది. ప్రస్తుతం గుణశేఖర్ ‘రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X