సలార్ మూవీపై చిరంజీవి రివ్యూ: ప్రభాస్‌ను ఆ పేరుతో పిలుస్తూ.. తగలబెట్టేశారు అంటూ!
'బాహుబలి' సిరీస్ తర్వాత వరుసగా ఫ్లాపులు వస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరిన్ని ప్రయత్నాలు చేస్తూనే వెళ్లాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఈ పాన్ ఇండియా హీరో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాను చేశాడు. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా ఈ మూవీ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ను కూడా కలెక్ట్ చేసింది.
Recommended Video


బాక్సాఫీస్ బెండు తీసేలా దూసుకుపోతోన్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం 'సలార్: సీజ్‌ఫైర్' మూవీపై ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌లో 'మై డియర్ దేవా (రెబెల్ స్టార్ ప్రభాస్).. నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. సలార్: సీజ్‌ఫైర్ మూవీతో మీరు బాక్సాఫీస్‌ను తగలబెట్టేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు అభినందనలు. మీరు సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యారు' అంటూ ప్రశంసలు కురిపించారు.
అదే ట్వీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మిగిలిన నటీనటులు, చిత్ర యూనిట్ సభ్యులను కూడా అభినందించారు. 'వరదరాజ మన్నార్ పాత్రను చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు, ఆద్య పాత్ర చేసిన శృతి హాసన్‌కు, కర్త పాత్ర చేసిన జగపతి బాబుకు శుభాకాంక్షలు. అలాగే, ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు అందరికీ ప్రత్యకమైన అభినందనలు' అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో వచ్చిన 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











