twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు చేస్తున్న సహాయానికి థ్యాంక్స్.. ప్రియమైన కోడలా అంటూ చిరు ప్రశంసలు

    |

    కరోనా గురించి, అది సృష్టిస్తోన్న బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. కరోనా ధాటికి అగ్ర రాజ్యం అమెరికా సైతం నిలవలేకపోతోంది. కరోనా సోకిన వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య అమెరికాలో ఎక్కువగా ఉంది. కరోనాపై భారత ప్రభుత్వం నిర్విరామంగా పోరాడుతూనే ఉంది.

    జనమంతా ఒకే త్రాటిపై..

    జనమంతా ఒకే త్రాటిపై..

    మన దేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రజలంతా ఇంటికి పరిమితమవ్వాలన్న ఆదేశాలను కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితలో ఉన్న కార్మికులను, శ్రామికులను ఆదుకునేందుకు సినీ తారలు కదలివచ్చారు.

    అండగా నిలిచిన సెలెబ్రిటీలు..

    అండగా నిలిచిన సెలెబ్రిటీలు..

    కరోనాపై పోరాటం సాగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందు స్టార్ హీరోలంతా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో పని చేసే సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి నడుంబిగించాడు.

    కరోనా క్రైసిసి ఛారిటీ..

    కరోనా క్రైసిసి ఛారిటీ..

    లాక్ డౌన్ వల్ల కష్టాలు పడుతున్న సినీ శ్రామికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని చిరంజీవి స్థాపించాడు. తాను ముందుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి మిగతా వారిని విరాళం ఇవ్వమని పిలుపునిచ్చాడు. దీంతో విరాళాలు వెల్లువెత్తాయి.

    అమితాబ్ సలహా మేరకు..

    అమితాబ్ సలహా మేరకు..

    తాజాగా ఓ మీడియాలో మాట్లాడిన చిరు సీసీసీ కార్యకలాపాల గురించి చెప్పుకొచ్చాడు. అందరికీ ఎలా సాయం అందించాలో అమితాబ్ ఓ ఐడియా ఇచ్చాడని తెలిపాడు. అందరికీ ఓ బయోమెట్రిక్ కార్డ్ ఇవ్వమని, దాన్ని ఆదార్‌కు లింక్ చేయమని చెప్పినట్టుగా పేర్కొన్నాడు.తాము కూడా అదే పద్దతిని అవలంభిస్తున్నామని తెలిపాడట.

    అపోలో ద్వారా ఉచితంగా మందులు..

    అపోలో ద్వారా ఉచితంగా మందులు..

    ఇలా సినీ కార్మికులకు నిత్యావరసర సరుకులే కాక.. శానిటేజర్, గ్లౌవ్స్, కొన్ని మందులు కూడా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపాడు. అందుకోసం ఉపాసన ముందుకు వచ్చిందని, తానే దగ్గరుండి మరీ చూసుకుంటోందని,అపోలో ఫార్మసీ ద్వారా వాటిని అందజేస్తున్నట్టు తెలిపాడు.

    ప్రియమైన కోడలా..


    ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కోడలు ఉపాసనను ప్రశంసించాడు. నా ప్రియమైన కోడలు ఉపాసన.. సీసీసీలోని మెంబర్స్ అందరికీ ఉచితంగా మందులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నీకు ధన్యవాదాలు. నువ్వు ఎంతో గొప్పదానివి అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించాడు.

    English summary
    Chiranjeevi Praised Upasana For Giving Free Medicine To CCC Members. Chiranjeevi established Corona Crisis Charity. Upasana Come Forward To Give Free Medicine To CCC Memners.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X