బాలకృష్ణ 'సింహా'కు చిరంజీవి ప్రశంసలు
బాలకృష్ణ హీరోగా నటించిన 'సింహా' చిత్రాన్ని చిరంజీవి ప్రశంసించారు. "ఈ ఏడాది 90 సినిమాలు రిలీజయితే వాటిలో ఆడిన సినిమాలు పదే. నిర్మాతల నుంచి ఎగ్జిబిటర్ల దాకా లాభాలు తీసుకొచ్చిన సినిమాలు రెండయితే వాటిలో 'సింహా' ఒకటి అని ఆయనన్నారు. సోమవారం హైదరాబాద్ ..శిల్పకళా వేదికలో జరిగిన 'ఆరెంజ్' చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఇక ఈ కార్యక్రమంలో హీరోలు అల్లు అర్జున్, రాణా, 'ఆరెంజ్' నిర్మాత నాగబాబు, దర్శకుడు భాస్కర్, సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్, పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ..కూడా ఈ పంక్షన్ కి హాజవటం అంతటా చర్చనీయాంసంగా మారింది. ఇక ఆరెంజ్ చిత్రం హీరో రామ్ చరణ్ మాత్రం ఈ వేడుకకి హాజరుకాలేక పోయాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆరెంజ్ సినిమా పాట షూటింగులో పాల్గొంటున్నందున రాలేకపోయారని చెప్పారు.
బాలకృష్ణ చిరంజీవి ఆరెంజ్ సింహా రామ్ చరణ్ తేజ్ శ్రీజ balakrishna orange simha ram charan teja chiranjeevi


Click it and Unblock the Notifications