twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాస్మా దానం చేసిన నాగబాబు.. మెచ్చుకున్న చిరంజీవి

    |

    కరోనా నుంచి కాపాడేందుకు మన వద్ద ఉన్న ఆయుధం ప్లాస్మా. కరోనా నుంచి కోలుకున్నవారిలో నుంచి ప్లాస్మా సేకరించి, దాని ద్వారా మరో ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు అందరూ ముందుకు రాకపోవడం, కొందరిలో అనుమానాలు ఉండటంతో సీపీ సజ్జనార్ సినీ సెలెబ్రిటీల చేత అవగాహన కార్యక్రమాలు చేయించాడు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి ఇలా పెద్ద పెద్ద వారంతా ప్లాస్మా దానానికి ఉన్న అవశ్యకతను తెలిపారు.

    కరోనా నుంచి కోలుకున్న వారంతా ప్లాస్మాను దానం చేయాలని చిరంజీవి కోరాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో ప్రత్యేకంగా ప్లాస్మాను సేకరించే విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలిపాడు. యాంటీ బాడీస్ ఉత్పత్తి అయిన వారందందరూ వచ్చి ప్లాస్మా దానం చేయాలని వేడుకున్నాడు. ఈ క్రమంలో నాగబాబు కూడా ప్లాస్మాను దానం చేశాడు. ఈ మధ్యే నాగబాబు కరోనా నుంచి కోలుకున్నాడు.

     Chiranjeevi Praises nagababu ABout Donating Plasma

    ప్లాస్మా దానం చేసిన నాగబాబును చిరంజీవి ప్రశంసించాడు. 'కోవిడ్‌తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCT(చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్)లో ప్లాస్మా చేసిన తమ్ముడు నాగబాబు కి అభినందనలు, ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి' అని చిరు పిలుపునిచ్చాడు.

    English summary
    Chiranjeevi Praises nagababu ABout Donating Plasma, nagababu Donated Plasma,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X