‘శిరిడి సాయి’పై చిరంజీవి ఎమోషన్‌గా...
హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన మరో భక్తి రస చిత్రం శిరిడి సాయి. తాజాగా ఈచిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రసాద్ ల్యాబ్ లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శిరిడి సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్.... చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాన
శిరిడి సాయిగా నాగార్జున అద్భుతంగా నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు... ఇప్పుడు శిరిడి సాయి చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను. ఇప్పడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లు కట్టినట్టుగా అనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు గారు కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్ రెడ్డి సాయి తత్వాన్ని అందరి తెలియచేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు' అని వ్యాఖ్యానించారు.
శిరిడి సాయి చిత్రయూనిట్ ఈనెల 11 వైజాగ్ నుంచి విజయ యాత్ర ప్రారంభించనున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్ రెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో దేశంలో ఇతర భాషల్లోకి ఈచిత్రాన్ని అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.


Click it and Unblock the Notifications











