వైష్ణవిపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్: ఆ తప్పులు చేస్తున్నారు.. క్లైమాక్స్ నచ్చలేదు కానీ అంటూ!

టాలీవుడ్‌లో వచ్చిన యూత్‌ఫుల్ సినిమాల్లో కొన్ని మాత్రమే భారీ సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నాయి. అందులో ఇటీవలే వచ్చిన 'బేబి' ఒకటి. సమకాలీన ప్రేమ ఎలా ఉంటుందో అన్న కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఊహించని రీతిలో భారీ స్పందనను అందించారు. ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరిట ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించి, ఓ మెసేజ్‌ను ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

బేబి అంటూ వచ్చిన టీమ్:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన చిత్రమే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.

Chiranjeevi Praises on Anand, Vaishnavi and Baby Team At Baby Mega Cult Celebrations

భారీ హిట్.. చిరు ఈవెంట్:కాంటెంపరరీ లవ్ స్టోరీతో తెరకెక్కిన 'బేబి' మూవీ సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరిట ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. దీన్ని చాలా తక్కువ మందితో నిడారంభరంగా జరిపారు. దీనికి చిరంజీవి చీఫ్ గెప్టుగా వచ్చి సందడి చేశారు.

ఫ్యాన్స్ సక్సెస్‌తో హ్యాపీగా:'బేబి' ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు పుత్రోత్సాహం తెలుసు.. తమ్ముడు, మేనల్లుళ్ల సక్సెస్ చూశాను. ఇప్పుడు నన్ను చూసి ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ల సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా అభిమానులు మారుతి, ఎస్‌కేఎన్, సాయి రాజేష్ వంటి వాళ్లు ఇప్పుడు విజయాన్ని అందుకోవడం గర్వంగా అనిపిస్తుంది' అని చెప్పారు.

Chiranjeevi Praises on Anand, Vaishnavi and Baby Team At Baby Mega Cult Celebrations

హీరో ఆనంద్ వావ్ అనేలా:ఆనంద్ గురించి మాట్లాడుతూ.. 'సోదరుడు విజయ్ దేవరకొండకు సోదరుడు ఆనంద్ సినిమాను గతంలో ఒకటి చూశా. కానీ ఇందులో ఎంతో సటిల్డ్ కుర్రాడిలా నటించాడు. ముఖ్యంగా తన ప్రియురాలి వీడియోను ఫ్రెండ్ చూపించినప్పుడు.. ఆనంద్ తన ఫీలింగ్‌ను మొహం మీద చూపించాడు. హృదయంలోని బాధను చూపించాడు.. వావ్ అనిపించాడు' అని వెల్లడించారు.

Chiranjeevi Praises on Anand, Vaishnavi and Baby Team At Baby Mega Cult Celebrations

వైష్ణవి సహజనటి అంటూ:వైష్ణవి గురించి వెల్లడిస్తూ.. 'వైష్ణవి బస్తీలో అమ్మాయి నుంచి కాలేజ్ వరకు నటనలో పర్ఫామెన్స్ పరంగా చూసినా ఎంతో మెచ్యూర్డ్‌గా చేసింది. ఎన్ని సినిమాల ఎక్స్‌పీరియెన్స్ ఉందో అనుకున్నా.. మొదటి సినిమాకే ఇలా చేసిందా అని ఆశ్చర్యపోయా. సహజ నటి జయసుధ గారిని తలపించే నటి నాకు తారసపడలేదు. వైష్ణవిని చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఎంతో ఇంటెన్స్‌గా నటించింది. గ్లామర్, డీ గ్లామర్‌గా కనిపించింది. ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంది' అని ప్రశంసించారు.

Chiranjeevi Praises on Anand, Vaishnavi and Baby Team At Baby Mega Cult Celebrations

వాళ్లంతా అదరగొట్టారని:చిరు కంటిన్యూ చేస్తూ 'రెండో కుర్రాడు విరాజ్.. మంచి ప్రేమికుడిగా నటించాడు.. ఈ స్క్రిప్ట్‌లో అందరూ మంచి వాళ్లే. ప్రేమకోసం పరితపించి పోతాడు. ఆకర్షణకు, నిజమైన ప్రేమకు తేడా తెలియకపోవడం.. దారి తప్పడం.. సంఘర్షణలో ఆ అమ్మాయి ఉండటం.. చివరకు నిర్ణయాన్ని దేవుడికే వదిలేశారు. కెమెరామెన్ బాల్ రెడ్డి, మ్యూజిక్ విజయ్, ఎడిటర్ విప్లవ్ గారికి అభినందనలు. ఇది ఎడ్యుకేటివ్ సినిమా. ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సినిమా కాదు. చూసి వదిలేసే సినిమా కాదు.. ఆ కంటెంట్ వదలనివ్వదు' అని వివరించారు.

తప్పులు చేస్తున్నారని:ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. 'ఈరోజు యువత అంతా కూడా సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయింది. అదే ప్రపంచంగా ఉంటున్నారు. అది మన చేతుల్లో లేదు.. దాని చేతుల్లో మనం ఉన్నాం. ఫ్రెండ్‌తో చాటింగ్. ఏదో ఒక బలహీనత.. వాటిని క్యాప్చర్ చేయడం.. బ్లాక్ మెయిల్ చేయడం.. చాలా జరుగుతుంటాయి. యువత, తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడాల్సిన సమయం. మన బిడ్డలు ఇలాంటి వాటి నుంచి ఎలా సంరక్షించుకోవాలో చూసుకోవాలి.. బేబిని ఎడ్యుకేటివ్ సినిమాగా చూడాలి.. పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలి' అని పేర్కొన్నారు.

Chiranjeevi Praises on Anand, Vaishnavi and Baby Team At Baby Mega Cult Celebrations

క్లైమాక్స్ నచ్చలేదు కానీ:చివర్లో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోకుండా నన్ అవడమో, ఏదైనా మఠంలో చేరడమో చూపిస్తే బాగుండు అనిపించింది. ఇదే సాయి రాజేష్‌కు చెప్పాను. కానీ, అతడు చేసిందే కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ప్రేమతో లైఫ్ ఎండ్ కాదు.. మరో కొత్త జీవితం కూడా ఉంటుంది. ఇలా చూపించిన రాజేష్ గొప్ప దర్శకుడిగా అనిపించాడు. అతడిలో చాలా టాలెంట్ ఉంది. త్వరలోనే రాజేష్ టాప్ డైరెక్టర్ అవుతాడు' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X