వరుణ్ నాకు అలా మెసేజ్ చేశాడు.. లావణ్యను అందుకే పెళ్లి చేసుకున్నాడు: చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మంచి బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనలోని టాలెంట్లను నిరూపించుకోవడంతో పాటు డిఫరెంట్ మూవీలు చేసి స్టార్‌డమ్‌ను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆ మధ్య వరుస హిట్లను అందుకున్న అతడు.. ఇటీవలి కాలంలో ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.
దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాను చేశాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

ఆపరేషన్ వాలెంటైన్‌తో వరుణ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రమే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

ఎంతో గ్రాండ్‌గా మూవీ ఈవెంట్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొంది 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని మార్చి 1న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చిన ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చారు.

డాడీ మీతో మాట్లాడాలి అంటూ: 'ఆపరేషన్ వాలెంటైన్' ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్య అమెరికాలో ఉండగా ''డాడీ మీతో మాట్లాడాలి'' అని వరుణ్ నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత కాల్ చేసి మా మూవీ ఫంక్షన్ జరుగుతుంది.. మీరు గెస్టుగా రావాలని అడిగాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మీద తీసిన ఇలాంటి సినిమాకి మీరు వస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది అని అడిగాడు' అని చెప్పారు.

గొప్ప అవకాశంగా భావించాను: చిరంజీవి కొనసాగిస్తూ.. 'వరుణ్ చెప్పగానే ఇది నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావించాను. ఒక సైనికుడి గురించి పది మందికి తెలిసేలా చేయడానికి నన్ను రమ్మన్నాడు. ఇలాంటి రియల్ హీరోల మీద తీసే సినిమాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ ఫంక్షన్‌కి రావడం నాకు గర్వంగా ఉంది' అన్నారు.

రియల్ హీరోల కోసం చూడాలి: చిరు కంటిన్యూ చేస్తూ.. 'డైరెక్టర్ శక్తి ప్రతాప్ గురించి వరుణ్ చెప్పాడు. అతను కేవలం ఒక కమర్షియల్ డైరెక్టర్‌గా అవుదామని రాలేదు. ఆయన దేశానికి సేవ చేసే వారి మీద రీసెర్చ్ చేస్తుంటాడు. ఇలాంటి సినిమాలు ఆడాలి.. ఇలాంటి కథలు వచ్చినప్పుడు మనం చూడాలి. యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి. మన కోసం కాపు కాసే జవాన్ల కోసం ఈ సినిమాను చూడాలి' అని కోరారు.

వీళ్లంతా నన్ను చూడడం వల్లే: తన ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు రావడంపై చిరంజీవి మాట్లాడుతూ.. 'వీళ్లంతా (మెగా హీరోలు) నన్ను ఎప్పుడూ మేకప్‌తో చూసి.. వాళ్లకి ఇంక వేరే ఫీల్డ్‌లోకి వెళ్లాలనే ఆలోచనే రాలేదనుకుంట. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బెస్ట్ ఇండస్ట్రీ. దీన్ని అంత గౌరవిస్తాను. ఇలాంటి దానిలోకి నా బిడ్డలు వస్తే అంతకన్నా ఏం కావాలి అనుకున్నాను' అని చెప్పుకొచ్చారు.
లావణ్యను అలానే పెళ్లాడాడు: వరుణ్ తేజ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. 'పరిశ్రమకి వచ్చినప్పటి నుంచీ వరుణ్ నన్ను ఫాలో అవ్వట్లేదు. మా కుటుంబంలో ఏ హీరోకి రాని అవకాశాలు, డిఫరెంట్ రోల్స్ వరుణ్‌కు వచ్చాయి. ప్రతిదీ తను చాలా పద్దతిగా చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. తను చేసిన 13 సినిమాలు చాలా డిఫరెంట్ మూవీస్' అని పేర్కొన్నారు.

టాలెంట్ ఎవడబ్బసొత్తు కాదు: చివర్లో చిరు 'వరుణ్ చేసిన ఈ మూవీ.. ఒక ఎయిర్ స్ట్రైక్ మీద తీసిన మొట్ట మొదటి సినిమా కావడం గర్వంగా ఉంది. ఏడాది క్రితం ఓ హాలివుడ్ మూవీ చూసి ఇలాంటివి మనం తీయగలమా అనుకున్నా. కానీ ఈ మూవీలో సీన్స్ చూశాకా అలాంటి సినిమాను మన తెలుగోళ్లు ఈజీగా చేసి అవతల పడేశారంటే.. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనిపించింది' అని ముగించారు.


Click it and Unblock the Notifications











