అంబులపొదిలోంచి వదిలిన రామబాణం.. అదిరింది, అమోఘం.. జక్కన్నపై చిరంజీవి ప్రశంసలు
రామ్ చరణ్ బర్త్ డేను మరుపురాని రోజుగా మలిచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. నేటి ఉదయం నుంచి ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ వార్తలే. రామరాజు కోసం భీమ్ అంటూ హల్చల్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. మొత్తానికి అల్లూరి సీతారామరాజు ఎలా ఉండబోతాడో అందరికీ చూపించేసింది. దేశంలో కరోనా తాండవం చేస్తున్న ఈ తరుణంలోనూ అల్లూరిగా రామ్ చరణ్ అందర్నీ తనవైపుకు తిప్పుకున్నాడు.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్..
ఎన్టీఆర్ తెలంగాణ యాసలో అల్లూరి గురించి చెప్పిన డైలాగ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది.. కలబడితే వేగుచుక్క ఎగబడినట్టు ఉంటది.. ఎదురుపడితే సావుకైనా చెమట దారపడతి.. బాణమైనా బంధూకైనా వానికి బాంచన్ అయితది.. ఇంటి పేరు అల్లూరి సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అనే డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.

అందర్నీ ఆశ్చర్యపరిచిన రామ్ చరణ్..
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్స్‌లో ఒక్కో డైలాగ్ అలా వినిపిస్తు ఉంటే.. దానికి ప్రతిరూపంగా రామ్ చరణ్‌ను చూపించడం హైలెట్‌గా నిలిచింది, అల్లూరి పాత్రలో రామ్ చరణ్ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపిస్తుంది. బాణం ఎక్కుపెట్టే తీరు..కర్రతిప్పే స్టైల్, గన్ పేల్చే విధానం ఇలా అన్నింటిలోనూ రామ్ చరణ్ తన ప్రత్యేతను చూపించాడు.
వెయిటింగ్ అంటూ చిరు ట్వీట్..
రామరాజు కోసం భీమ్ ఇచ్చే గిఫ్ట్‌ను చూడాలంటూ చిరు తెగ ఉబలాట పడ్డాడు. ఉదయం పది గంటలకే వస్తుందని ప్రకటించడంతో వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశాడు చిరు. అయితే అది కాస్తా ఆలస్యం కావడం రాజమౌళి బుజ్జగించడంతో చిరు కూల్ అయిపోయాడు.
Recommended Video

అంబులపొదిలోంచి వదిలిన రామబాణం..
తాజాగా ఈ వీడియోపై స్పందించిన చిరంజీవి.. అదిరింది రాజమౌళి అని కితాబిచ్చాడు. అంబులపొదిలోంచి వదిలిన రామబాణం, తారక్ అమోగం.. దుమ్ములేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు.. తారక్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి.. అంటూ చిరు ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











