దేశంలోనే గొప్ప నటుడు.. అదే ఉప్పెనకు మొదటి సక్సెస్.. విజయ్ సేతుపతి ఆకాశానికెత్తిన చిరంజీవి

ఉప్పెన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప్పెన చిత్రంలో కీలక పాత్రను పోషించిన విజయ్ సేతుపతితోపాటు హీరో, హీరోయిన్లు, నటులు, టాలీవుడ్ దర్శకులు హరీష్ శంకర్, కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి గురించి చిరంజీవి మాట్లాడుతూ..

Recommended Video

Megastar Chiranjeevi Praises Vijay Sethupathi In Uppena Pre release Event | Filmibeat Telugu
దేశంలో అద్బుతమైన నటుడు

దేశంలో అద్బుతమైన నటుడు

ఉప్పెన సినిమా చిత్ర ముగింపు అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నటీ నటులు గురించి చెప్పుకోవాలంటే ప్రప్రథమంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి చెప్పుకోవాలి. మానవత్వం ఉన్న వ్యక్తం. నిరాడంబరమైన వ్యక్తి. దేశంలో అద్భుతమైన నటుల్లో ఒకరు. తమిళంలో హీరోగా అత్యంత ప్రజాదరణ ఉంది. అలాంటి నటుడు హీరోగానే చేయాలి అనే విధంగా కాకుండా మంచి క్యారెక్టర్‌లో జీవించాలని తప్పన పడే నటుడు. ఎలాంటి క్యారెక్టర్‌నైనా అవలీలగా పోషిస్తాడు అని చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తారు.

 భవానీ క్యారెక్టర్‌నే లవ్ చేశా

భవానీ క్యారెక్టర్‌నే లవ్ చేశా

ఇటీవల కాలంలో మాస్టర్‌ చిత్రంలో విలన్‌‌గా చేశాడు. భవానీ క్యారెక్టర్‌ను అద్భుతంగా పోషించాడు. హీరోకు ధీటుగా ప్రతిభను చాటుకొన్నారు. ఒక్కోసారి హీరోకు ధీటుగా నటించాడు. ఆ సినిమాలో భవానీ క్యారెక్టర్‌నే లవ్ చేశాను. నేను నటించిన సైరా చిత్రంలో పాత్ర ఎంత నిడివి ఉందనే విషయాన్ని పక్కన పెట్టి కీలక పాత్రల్లో నటించాడు. చిరంజీవి అడిగారు అని చెప్పి అందులో పాత్రను అద్భుతంగా చేసి ఆ క్యారెక్టర్‌ను నిలబెట్టేలా చేశారు అని చిరంజీవి తెలిపారు.

జార్జియాలో విజయ్ సేతుపతికి కోకొల్లలుగా ఫ్యాన్స్

జార్జియాలో విజయ్ సేతుపతికి కోకొల్లలుగా ఫ్యాన్స్

సైరా సినిమా క్లైమాక్స్ షూటింగ్ జార్జియాలో చేస్తున్నాం. ఆ సమయంలో మేము ఉంటున్న హోటల్‌ రిసెప్షన్‌ వద్ద అభిమానులు వచ్చి గొడవ చేశారు. ఇక్కడ కూడా ఫ్యాన్స్ గోల ఏంటిరా అంటూ నేను కిందికి దిగే ప్రయత్నం చేశాను. అప్పటికే కేకలు వినిస్తుంటే ఎవరు వెళ్లారని చూశాను అని చిరంజీవి చెప్పారు.

అందుకే ఆయన విలక్షణ నటుడు

అందుకే ఆయన విలక్షణ నటుడు

అంతకుముందే విజయ్ సేతుపతి కిందకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ సేతుపతిని చూడనిదే వెళ్లమని ఫ్యాన్స్ గోల చేస్తున్నారని యూనిట్ సిబ్బంది చెప్పారు. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. జార్జియాలో కూడా విజయ్ సేతుపతికి కోకోల్లలుగా అభిమానుల ఉన్నారు. అందుకే ఆయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్నారు అంటూ విజయ్ సేతుపతిని ప్రశంసలతో చిరంజీవి ముంచెత్తారు.

విజయ్ సేతుపతి ఒప్పుకోవడమే ఉప్పెనకు సక్సెస్

విజయ్ సేతుపతి ఒప్పుకోవడమే ఉప్పెనకు సక్సెస్

బుచ్చిబాబు సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు హీరోయిన్ తండ్రి పాత్రకు విజయ్ సేతుపతిని అనుకొంటున్నానని చెప్పారు. అప్పుడు బుచ్చిబాబు ఆశకు అంతు కూడా లేదు. విజయ్ సేతుపతి ఎంత బిజీ ఆర్టిస్టు.. ఈ సినిమాను ఒప్పుకొంటాడా అనుకొన్నాను. కానీ బుచ్చిబాబు ఎంత బలంగా కోరుకొన్నారో.. విజయ్ సేతుపతి కథ వినగానే ఒప్పుకున్నారు. విజయ్ సేతుపతి నటించడానికి ఒప్పుకొన్నప్పుడే ఉప్పెన సినిమా సక్సెస్ కొట్టింది. అంతటి గొప్ప నటుడు విజయ్ సేతుపతి అని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X