చిరంజీవిని లైన్లో పెట్టేసిన మంచు లక్ష్మీప్రసన్న...
చిరంజీవికి, మోహన్ బాబుకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉందనేలా ఉండేది వారి ప్రవర్తన. కానీ ఈ మధ్య మాది టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అంటూ అటెండ్ అయిన ప్రతి చోట చెప్పుకుపోతున్న ఈ ద్వయం అది నిజమే అని నిరూపించడం కోసం నానా రకాలుగా ప్రయత్నిస్తోంది.
లేటెస్ట్ గా చిరుతో 'ప్రేమతో మీ లక్ష్మీ" కార్యక్రమాన్ని నిర్వర్తించిన మంచు లక్ష్మీప్రసన్న మెగాస్టార్ ని బాగానే బుట్టలో వేసేసింది. ఆమె అడిగిన ప్రశ్నలు చిరుకి ఎంతగానో నచ్చాయట. మరోసారి తన పాతకాలానికి తీసుకెళ్లి, తనలో పూర్తి ఎనర్జీని నింపిన లక్ష్మీప్రసన్నను కలుసుకుని కృతజ్ఝ తలు తెలిపేందుకు సతీ సమేతంగా మోహన్ బాబు ఇంటికి భోజనానికి వెళ్లాడంటే ఎంతటా లక్ష్మీ ప్రసన్న చిరుని ఆకర్షించిందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి వీరి రిలేషన్ ఇలానే పచ్చగా సాగాలని కోరుకుంటోంది సినీ ఇండస్ట్రీ..


Click it and Unblock the Notifications











