»   » 150వ సినిమాలో చిరంజీవి అవకాశమిస్తానన్నారు

150వ సినిమాలో చిరంజీవి అవకాశమిస్తానన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంలో ఓ బాలుడుకి అవకాసమిస్తానన్నారు. ఆ విషయాన్ని ఆ కుర్రాడు ఆనందంతో చెప్తున్నాడు. అంతేకాదు అందుకోసం తాను డాన్స్ నేర్చుకుంటున్నాను అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'నాకు చిరంజీవిని చూడాలని కోరిక ఉందని చెప్పాను. ఈ విషయం తెలుసుకున్న ఆయన స్వయంగా వచ్చి నాతో మాట్లాడారు. తన 150వ సినిమాలో నాకు అవకాశం ఇస్తానన్నారు. అందుకే నేను డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నా. జనవరి 1న ఫోన్ చేసి నాకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.' అని కేన్సర్ బాధితుడు సంగెం బాలు (తక్షక్) ఆనందంగా చెప్పాడు.

Chiranjeevi promises role in his 150th movie

గురువారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా జన్నారం వచ్చిన ఆ బాలుడు మీడియాతో మాట్లాడాడు. లక్ష్మణచాంద మండలానికి చెందిన సంగెం శ్రీధర్, పద్మల పెద్ద కుమారుడు బాలు క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

క్రితం నెలలో...హైదరాబాద్ ఎమ్.ఎన్. జె. కాన్సర్ హాస్పటిల్ కాన్సర్ వ్యాథితో బాధపడుతున్న బాలు అనే బాలుడుని స్వయంగా చిరంజీవి పరామర్శించారు. మీడియా ద్వారా ఆ బాలుడు తనను చూడాలనుకుంటన్నట్లు తెలుసుకున్న చిరంజీవి అక్కడికి వెళ్లి బాలుడిని పరామర్సించారు. ఆ సందర్భంగా ఆ బాలుడు కుటుంబ సబ్యులు భావవోద్వోగానికి గురి అయ్యారు. తమ కుమారుడికి చిరంజీవి పునర్జన్మ ఇచ్చినట్లు అయ్యిందని బాలు తండ్రి అన్నారు.

ఈ సందర్బంగా చిరంజీవి బాలుడికి ధైర్యం చెప్పి, తన సినిమాలోని కొన్ని డైలాగులు చెప్పించుకున్నారు. బాలు ఉత్సాహంగా చిరంజీవితో మాట్లాడారు. చిరంజీవితో డాన్స్ చేయాలని అంటే కోలుకున్న తర్వాత తన ఇంటికి రావచ్చు అని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi promises role in his 150th movie

చిరంజీవి 150 వ సినిమాకు క్రేజ్ ఏ రీతిలో ఉంటుందో లేదో కానీ ..మీడియాలో మాత్రం ఈ చిత్రం గురించి రోజుకో వార్తతో ఎప్పుడూ హాట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. దానికి తోడు వర్మ కూడా ఆయన ఆ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ కామెంట్స్ చేసారు.ఆ కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ... " చిరంజీవి గారు...తన 150వచిత్రం తనే డైరక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే...నాకు ఆయనతో ఉన్న ఇంట్రాక్షన్ తో ఆయనకు అందరి దర్శకుల కన్నా ఎక్కువ విషయాలు సినిమా గురించి తెలుసు.అదే చిరంజీవి గారు...త్రివిక్రమ్, వినాయిక్ వంటివారితో చేస్తే...అది మరో చిత్రం అవొచ్చేమో కానీ...అదే ఆయనే స్వయంగా డైరక్ట్ చేసుకుంటే అది ఆయన చిత్రం అవుతుంది...

నాకు బాగా నమ్మకం చిరంజీవి గారు..తన 150 వ సినిమా ని డైరక్ట్ చేసుకునే తెలివి, జ్ఞానం ఉన్నాయి. అదే చిరంజీవి గారు తన 150 చిత్రం డైరక్ట్ చేయకపోతే... అది ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కన్నా పెద్ద తప్పు అవుతుంది... చిరంజీవి గారు తన 150వ సినిమా ని తనే డైరక్ట్ చేసుకోవటం అనేది ఈ మూడు దశాబ్దాలలో ఓ స్పెక్టిక్యులర్ ఈవెంట్ అవుతుంది. ఆయన నిజమైన అభిమానులు...ఖచ్చితంగా ఆనందిస్తారు..".

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ కొంత కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు చిరు.

కొంతకాలం క్రితం బెంగుళూరులో చిరంజీవి మాట్లాడుతూ...చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే నటించడానికి నేను సిద్దమే అని, సోనియా గాంధీ అనుమతితో 150వ సినిమా చేస్తానని తెలిపారు.

English summary
Chiranjeevi meets Cancer patient Balu, promises role in his 150th movie. Chiranjeevi took some time out on Thursday afternoon to fulfill the wish of a 10 year old fan Balu, who was diagnosed with cancer, in a Hyderabad based cancer hospital. A native of Adilabad district, Balu has been suffering from cancer for the past three years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu