twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మంచి సినిమా కోసం చిరంజీవి రంగంలోకి...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అంజలి పాటిల్, సిద్ధిఖి,లక్ష్మీమీనన్, రత్నశేఖర్ ప్రధాన పాత్రల్లో రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా బంగారు తల్లి'. ప్రజ్వల సంస్థ సమర్పణలో సునీత కృష్ణన్, ఎం.ఎస్.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శంతన్ మొయిత్రా సంగీతం అందించారు. ఇటీవలే ఈచిత్రం ఆడియో వేడుక చిరంజీవి చేతుల మీదుగా జరిగింది.

    ఈ సినిమాను ప్రచారం కల్పించే బాధ్యతను స్వయంగా చిరంజీవి తీసుకున్నారు. గత 25 ఏళ్లలో ఏకంగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఒక మంచి సినిమాను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఈ బాధ్యతను తీసకున్నారు. ఈ నెల 21న సినిమా విడుదల కాబోతోంది.

    Chiranjeevi To Promote Na Bangaru Talli

    ఇటీవల ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ...ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వ్యభిచారం అనే ఇతివృత్తాన్ని తీసుకుని రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి తండ్రి చూడాల్సిన చిత్రమిది. నేను స్టాలిన్ చిత్రంలో చెప్పినట్లు సినిమా చూసిన ప్రతి ఒక్కరు మరో ముగ్గురిని, ఆ ముగ్గురు తలో ముగ్గురిని సినిమా చూసే విధంగా చేయాలి అన్నారు.

    ఈ చిత్ర నిర్మాత సునీత చేసే కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి వారికి అవార్డులు ఇవ్వకపోతే మరెందుకు అనిపించింది. తోటి మహిళలకు బాసటగా నిలవడం ఆమె గొప్పదనం. ప్రభుత్వం వారు ఆమెకు ఎలాంటి సహకారాన్ని అందించకపోయినా చక్కటి కమిట్‌మెంట్‌తో ఆమె ముందుకెళుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆమెకు సహకరించాల్సిన అవసరం ఎంతో వుంది. ప్రతి ఒక్కరినీ ఎడ్యుకేట్ చేసే చిత్రాన్ని ఆమె నిర్మించారని తెలిపారు.

    English summary
    Mega Star Chirajeevi will promote internationally acclaimed Telugu movie Na Bangaru Talli. It is the only movie to win 3 National Awards in the last past 25 years. The latest news about the movie is, it will again be screened in the states of Telangana and Andhra Pradesh on November 21 and Chiranjeevi will be promoting it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X