రామ్ చరణ్ నా పేరు చెడగొడుతున్నాడు... చిరంజీవి
రామ్ చరణ్ నాకున్న పేరుని అంతా చెడగొడుతున్నాడంటూ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే అది సీరియస్ గా కాదు..తనకు ఎంతో బాగా ఫైట్స్ చేస్తానని,ఎంతో స్పీడుగా డాన్స్ లు చేస్తాడని పేరు ఉండేదని,రామ్ చరణ్ వచ్చి తన కన్నా బాగా చేసేసి తన పేరుని మొత్తం చెరిపేస్తున్నాడని సరదగా అన్నారు. అలాగే మగధీర చిత్రంలో అంత బాగా చేసిన తన హీరో తన కొడుకు అవటం తను గర్వపడే అంశమన్నారు.
ఇక తాను నటించనని,తన నటవారసుడు రామ్ చరణ్ లోనే తనను చూసుకోమని చిరంజీవి స్పష్టం చేసారు.తన కుమారుడు రాంచరణే ఫ్యాన్స్ కోరికనూ తనకోరికనూ తీరుస్తాడని పుత్రోత్సాహం ప్రదర్శించారు. ఓ తెలుగు యాక్షన్ చానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన.. ఇక తాను సినిమాల్లో నటించనని తెగేసి చెప్పారు. ఇప్పటి వరకూ 149 సినిమాల్లో చేశానని, 150వ చిత్రం చేద్దామని గతంలో అనుకున్నా... ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలనే సీరియస్‌గా తీసుకోదలిచినట్లు తేల్చిచెప్పారు.
అలాగే 'మగధీర' రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదీ ఇప్పట్లో రాదని, అసలు రాకపోవచ్చు అని చెప్పారు. ఈ క్రమంలోనే మీరు సినిమా చేస్తే ఆ రికార్డు బద్దలు కావచ్చు కదా అన్న ప్రశ్నకు... 'మనం ఫీల్డ్‌లోకి దిగితే ఆ రికార్డు చెరగటం ఖాయం. కానీ.. పోనీలే, రామ్ చరణ్ చిన్నవాడు కదా.. వదిలేద్దాం. వాడిని డామినేట్ చేయటం ఈజీ' అని నవ్వేశారు.


Click it and Unblock the Notifications











