రాజమౌళిపై చిరంజీవి దృష్టి?
అవుటర్ టాలెంట్ కంటే లోకల్ టాలెంట్ మేలని ఇటీవల విడుదలైన తెలుగు చిత్రాలు పోకిరి, శ్రీ రామదాసు నిరూపించాయి. తమిళ దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను బంగారు కొండ మీద కూర్చోబెట్టబోయి కంచు కొండ ఎక్కించారు. అవుటర్ ట్యాలెంట్ విషయంలో చిరంజీవి స్టాలిన్ మినహాయింపని మూమూలుగానే పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా ఉండగా అచ్చ తెలుగు హ్యాట్రిక్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రారంభమైనట్టు గణపతి కాంప్లెక్స్ ఆవరణలో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే రాజమౌళి ఏ సినిమా చేసినా ప్యాకేజి డీల్ మాట్లాడుకుంటారని అందరికీ తెలుసు. అంటే కథ నాన్న విజయేంద్రప్రసాద్‌కు, సంగీతం కీరవాణికి అప్పగించి మొత్తమ్మీద ఇన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారు. అవతల చిరంజీవి కూడా నైజాం హక్కులు, ఇతరత్రా కోరుతుంటారు. రెండు కత్తులు (డీల్స్) ఒక ఒరలో ఇముడుతాయా?


Click it and Unblock the Notifications