బ్రహ్మనందాన్ని సత్కరించిన చిరంజీవి, రాంచరణ్.. రంగ మార్తండలో ఫెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం
బ్రహ్మనందం తెర మీద కనిపిస్తే చాలూ ప్రేక్షకుల్లో ఆనందం కనిపిస్తుంది. తన కెరీర్‌లో దాదాపు 1200 చిత్రాల్లో విభిన్నమైన కమెడియన్ పాత్రలు, విలక్షణమైన హాస్యభరితమైన నటనతో కోట్ల మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు.
తన నటనకు, క్రేజ్ భిన్నంగా తాజాగా రంగ మార్తండ చిత్రంలో అద్బుతమైన నటనను ప్రదర్శించారు. మార్చి 22వ తేదీన రిలీజైన రంగ మార్తండ చిత్రంలో ఆయన నటనకు మెచ్చిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ వివరాల్లోకి వెళితే..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తాండ మూవీలో భావోద్వేగమైన నటుడిగా పాత్రలో కనిపించారు. హాస్యాన్ని పండిస్తూనే.. ప్రేక్షకుడిని కంటతడి పెట్టించే పాత్రలో నట విశ్వరూపం చూపించారు. భార్యను కోల్పోయిన భర్తగా, పిల్లలు లేని కారణంగా మనోవేదనకు గురైన వ్యక్తిగా, స్నేహితుడిగా, రంగస్థల నటుడిగా పలు కోణాల్లో ఉన్న పాత్రలో జీవించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణతో పోటీ పడుతూ తనదైన నటనను ప్రదర్శించారు.

రంగ మార్తండ సినిమా రిలీజ్‌కు ముందే ప్రదర్శించిన ప్రివ్యూ షోలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రతీ ఒక్కరు కూడా చక్రవర్తిగా బ్రహ్మనందం ఫెర్ఫార్మెన్స్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
తాజాగా షూటింగులతో బిజీగామారిన మెగాస్టార్ చిరంజీవి రంగ మార్తండ సినిమా గురించి పలువురు వెల్లడిస్తున్న అభిప్రాయలతో చిత్రాన్ని వీక్షించే ప్రయత్నం చేశారు. అలాగే ఆస్కార్ వేడుక ముగించుకొని.. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్న రాంచరణ్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

బ్రహ్మానందం నటనకు అబ్బురపడిన చిరంజీవి, రాంచరణ్ స్వయంగా కలిసి ఆయనను సత్కరించారు. బ్రహ్మనందం పోషించిన పాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గురించిన అనుభూతులను వారు పంచుకొన్నారు. ఈ సందర్భంగా మెగా హీరోల ప్రశంసలు అందుకొన్న బ్రహ్మనందం భావోద్వేగానిక గురయ్యారు.


Click it and Unblock the Notifications











