చిరు, చరణ్ ల నుండి బన్నీకి 10లక్షల వెడ్డింగ్ గిఫ్ట్ ఏమిటో తెలుసా...!?
ఇటీవల జరిగిన అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహానికి చిరంజీవి కుంటుంబం నుంచి అందిన కానుకల గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఈ కొత్త దంపతులు చిరంజీవి కుటుంబం నుంచి పొందిన కానుకల విలువ 10లక్షల రూపాయలని చెప్పొచ్చు. నాలుగు లక్షలు ఖరీదు చేసే 'కపుల్ వాచ్"ని చిరంజీవి అల్లు అర్జున్ కి కానుకగా ఇచ్చాడట.
క్రసాలా జ్యువెలరీ షాప్ లో తయారు చేయించిన 3లక్షల రూపాయలు విలువ చేసే నగలను స్నేహారెడ్డికి బహుమతిగా చిరు దంపతులు ఇచ్చారని సమాచారం. అల్లు అర్జున్ కి 3.5లక్షలు విలువ చేసే యూరోపియన్ టైలర్ మేడ్ సూట్ ని బహుమతిగా ఇచ్చాడు రామ్ చరణ్. దీన్ని బట్టి చిరు కుటుంబం ఇచ్చిన మొత్తం కానుకల విలువ పదిన్నర లక్షలని తెలుస్తోంది.
అల్లు అర్జున్ స్నేహా రెడ్డి చిరంజీవి రామ్ చరణ్ తేజ్ అల్లు అరవింద్ allu aravind sneha reddy chiranjeevi ram charan teja


Click it and Unblock the Notifications