twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!

    |

    గత కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టారు. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో రాజకీయాలంటే ఆసక్తి లేదంటూ ఆయన వెల్లడించారు. అయితే చిరంజీవి త్వరలోనే రాజకీయాల్లో క్రీయా శీలక పాత్రను పోషించబోతున్నారంటూ తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. వాస్తవానికి చిరు మళ్లీ రాజకీయాల్లో వస్తారా అనే విషయం మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

    పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం వెనుక చిరంజీవి.. పవర్‌స్టార్‌కు కోసం మెగాస్టార్ మాస్టర్ ప్లాన్!పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం వెనుక చిరంజీవి.. పవర్‌స్టార్‌కు కోసం మెగాస్టార్ మాస్టర్ ప్లాన్!

     పాలిటిక్స్‌కు దూరంగా చిరంజీవి

    పాలిటిక్స్‌కు దూరంగా చిరంజీవి

    యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వహించిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో అంటి ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా వరుసగా సినిమాలతో ముందుకెళ్తున్నారు. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలువడంతో మళ్లీ టాలీవుడ్‌లో మెగాస్టార్ హవా మళ్లీ మొదలైంది.

    సైరా తర్వాత వరుస సినిమాలు

    సైరా తర్వాత వరుస సినిమాలు

    సైరా తర్వాత ఆచార్యతో చిరంజీవి దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ మెగాస్టార్‌‌ జోష్‌కు బ్రేక్ వేసింది. అయితే లాక్‌డౌన్‌లో వరుసగా మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మెగాస్టార్ తన ఉద్దేశాలను అభిమానులకు సంకేతాలు పంపారు.

    జనసేనలో కీలక పాత్ర అంటూ

    జనసేనలో కీలక పాత్ర అంటూ

    ఇలా చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ తాజాగా నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. పెద్ద ఎత్తున మెగా అభిమానులు స్వాగతిస్తున్నారు.

    తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో

    తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో

    ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక, గ్రామ పంచాయితీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యల అనంతరం చిరంజీవి రాజకీయ పున: ప్రవేశంపై ఊహగానాలు మొదలయ్యాయి. చిరంజీవి రాజకీయ ప్రవేశంపై సంకేతాలిస్తూ నాదెండ్ల వ్యూహాత్మకంగా మాట్లాడటం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    Recommended Video

    Acharya Teaser On Jan 29 : Meme Makers గా మారిన మెగా హీరోలు | Chiranjeevi | Ram Charan
    పరోక్షంగానా? ప్రత్యక్షంగానా?

    పరోక్షంగానా? ప్రత్యక్షంగానా?

    గత కొద్ది సంవత్సరాలు పాలిటిక్స్ దూరంగా ఉంటున్న చిరంజీవి నిజంగానే క్రీయాశీలకంగా మారుతారా? లేక పరోక్షంగా జనసేనకు మద్దతిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే నాదెండ్ల వ్యాఖ్యలపై చిరంజీవి, పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనే ఇప్పుడు ఆసక్తికరమైన పాయింట్‌గా మారింది.

    English summary
    Jana Sena leader Nadendla Manohar made sensational comments on Chiranjeevi's polltical re entry into AP politics goes viral in the media. As per Nadendla reports that, Chiranjeevi is going to crucial role in the ap politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X