విశాఖ దుర్ఘటనపై టాలీవుడ్ సంతాపం.. మనసును కలిచివేసింది.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
విశాఖపట్నంలో బుధవారం అర్థరాత్రి జరిగిన విషవాయువు దుర్ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఎల్‌జీ పాలిమర్స్ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషవాయువు పీల్చి అనేకమంది రోడ్లపైకి వచ్చి భయానక స్థితిలో పడిపోయి ఉన్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు ఎనిమిదికి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలను షాక్‌కు గురి చేసిన ఈ ఘటనపై టాలీవుడ్ మొత్తం కదిలింది.

మనసును కలిచివేసింది..
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ.. విశాఖలో విష వాయువు స్టెరిన్ బారిన పడి ప్రజలు మరణించటం మనసుని కలిచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. లాక్ డౌన్ తరువాత ఓపెన్ చేసే ఇండస్ట్రీల్లో అన్ని జాగ్రత్తలు ఉండేలా చూసుకోవాలని సంబంధింత అధికారులను ప్రార్థిస్తున్నా'ని ట్వీట్ చేశాడు.

హృదయం ధ్రవించింది..
మహేష్ బాబు స్పందిస్తూ.. ‘విశాఖ గ్యాస్ ఘటన వార్త విని నా హృదయం ధ్రవించింది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొవడానికి ఎంతో చేయాల్సి ఉంది.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలకు బలం చేకూరాలి, వారికి నా హృదయపూర్వకంగా సానుభూతిని తెలుపుతున్నాను. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. వైజాగ్ సురక్షితంగా ఉండాల'ని ట్వీట్ చేశాడు.

హృదయం బద్దలైంది..
అల్లు అర్జున్ స్పందిస్తూ.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రాంతమైన వైజాగ్‌లో ఇాలాంటి ఘటన జరగడంతో నా హృదయం బద్దలైనట్టు అనిపిస్తోంది. ఇలాంటి భయంకరమైన ప్రమాదంతో నేనేంతో కలత చెందాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'ని పేర్కొన్నాడు.

తీవ్రంగా కలచివేసింది.
వైజాగ్ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైజాగ్ నగరం మరింత బలంగా ఉండాల'ని కోరుకున్నాడు.

ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన ఫోటోలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. హాస్పిటల్‌లో చేరిన బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని రాజమౌళి ట్వీట్ చేశారు.

షాక్ గురయ్యాను.. కొరటాల శివ
వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఆ దుర్ఘటన నన్ను తీవ్రంగా కలిచివేయడమే కాకుండా విషాదానికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం, అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని కొరటాల శివ ట్రీట్ చేశారు.

నా హృదయం ముక్కలైంది
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన హృదయాన్ని ముక్కలు చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఈ ప్రమాదం వల్ల అనారోగ్యానికి గురైన వారు త్వరగా కోలుకోవాలి అని సినీ హీరో అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.

త్వరగా కోలుకోవాలి..
విశాఖ గ్యాస్ లీక్ ఘటన వార్తతో విషాదంలో మునిగిపోయాను. యువత సహాయక చర్యల్లో భాగమై అద్భుతంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనలో అనారోగ్యం పాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ నిర్మాత టాగోర్ మధు ట్వీట్ చేశారు
Recommended Video

మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి కష్ట సమయాల్లో మరింత మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని, అనారోగ్యానికి గురైన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని సీనియర్ నటి కుష్భూ సుందర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











