అవార్డులపై రేవంత్ రెడ్డి ఫైర్.. చిరంజీవి కూల్‌గా రియాక్షన్!
నంది అవార్డుల వ్యవహారం తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుమల అవార్డుల బహుకరణపై తమ ప్రభుత్వ విధానం ఏమిటో గతంలో చెప్పారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ కాస్త కఠినంగానే స్పందించారు. అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలు అందుకు చిరంజీవి ఇచ్చిన సమాధానం వివరాల్లోకి వెళితే..
గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా డిసెంబర్ 9న గద్దర్ స్మారక అవార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. సినిమా పరిశ్రమలో బాధ్యత వహిస్తున్న వారు ఓ ప్రతిపాదనతో రావాలని సూచించాను. వారు అడగకముందే నేను ప్రకటన చేసినా.. ఎందుకో వారు ముందుకు రాలేదు. ప్రభుత్వంతో సంప్రదింపులు చేయలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు.

నంది అవార్డుల కంటే ఘనంగా గద్దర్ అవార్డులు ఇస్తాం. తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన రోజున అవార్డులు ఇవ్వాలని అనుకొన్నాం. కానీ సినీ ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా సినీ ప్రముఖుల నుంచి కొందరు ముందుకు వచ్చి నా ప్రతిపాధనను ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు.
రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. తెలుగు సినిమా ప్రపంచంలోనే గుర్తింపును పొందుతున్నది. ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం ఉండాలి. అలాంటి ప్రోత్సాహం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది. స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. అది కూడా జీవితాంతం ప్రజా సేవ కోసం, మార్పు కోసం పాటుపడిన మహనీయుడు గద్దర్ పేరిట ఇవ్వడం గర్వంగా ఉంది అని చిరంజీవి అన్నారు.

గద్దర్ పేరున అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అవార్డులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది అని చిరంజీవి చెప్పారు. స్వయంగా ఆయన చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











