twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెటర్నరీ డాక్టర్ భయానక హత్య: చిరంజీవి ఎమోషనల్ రియాక్షన్.. ఆడపిల్లలకు మెగాస్టార్ సలహా

    |

    Recommended Video

    Mega Star Chiranjeevi Emotional On Disha Issue ||

    హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి భయానక హత్య యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా ఈ హత్యను ఖండిస్తున్నారు జనం. మానవ మృగాల రాక్షసత్వానికి బలైన ప్రియాంక రెడ్డి తరుపున యావత్ లోకం నిరసరస జ్వాలలు రగుల్చుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తీవ్ర ఆవేదన చెందారు.

    భయానక హత్యను ఖండిస్తూ సినీ తారల రియాక్షన్

    భయానక హత్యను ఖండిస్తూ సినీ తారల రియాక్షన్

    ప్రియాంక రెడ్డి భయానక హత్యను ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. వరుణ్ తేజ్, అనుష్క, సాయి ధరమ్ తేజ్, పూజా హెగ్డే, మంచు లక్ష్మీ, సుమ, నాని, సుధీర్ బాబు, అల్లరి నరేష్, శ్రీ ముఖి లాంటి ఎందరో ప్రముఖులు ఈ ఉదంతాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.

     మృగాల మధ్యా.. మనం బ్రతికేదంటూ చిరంజీవి

    మృగాల మధ్యా.. మనం బ్రతికేదంటూ చిరంజీవి

    తాజాగా ఇదే అంశంపై చిరంజీవి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ''గత రెండు మూడు రోజుల నుండి వినపడుతున్న ఆడపిల్లలపై హత్యాచారాలు అనే వార్తలు వింటుంటే ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావన కలుగుతోంది. ఇటువంటి మృగాల మధ్యా.. మనం బ్రతుకుతోంది అని అనిపిస్తోంది. ఈ అఘాయిత్యాలు వింటుంటే మనసు కలిచివేస్తోంది'' అని చిరు పేర్కొన్నారు.

    నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు

    నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు

    ఈ సంఘటనలపై ఒక అన్నగా తండ్రిగా నా స్పందనను తెలియ జేస్తున్నాననంటూ పేర్కొన్న చిరు.. ''ఇలాంటి నేరాలను చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష భయం కలిగించేలా ఉండాలి. నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు. త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే తొలుత వారికి శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడతారు'' అని అన్నారు.

    ఆడపిల్లలకు చిరంజీవి సలహా

    ఆడపిల్లలందరికీ నేను చెప్పేదొక్కటే.. మీ ఫోన్‌లో 100 నెంబర్ సేవ్ చెసుకోండి. అలాగే మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులో ‘హాక్-ఐ' అనే యాప్ డౌన్‌‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బటన్ నొక్కితే చాలు ‘షీ టీమ్స్' వాళ్లు హుటాహుటిన మీ వద్దకు చేరుకుంటాయి. పోలీస్ వారి సేవలను వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలను రక్షించడం.. వారిని గౌరవించడం.. ప్రతి ఒక్కరి బాధ్యత" అని అన్నారు చిరంజీవి.

    English summary
    Priyanka Reddy murder is trending around country. On this issue Tollywood Celebrities reacted and putting their condolence. Now megastar Chiranjeevi reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X