twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదంతా ఫేక్.. అస్సలు నమ్మొద్దు.. హాట్ టాపిక్ అయిన చిరంజీవి స్టేట్‌మెంట్

    |

    సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ రోజుల్లో సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు బాగా పెరిగారు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ దానిని ప్రజల్లోకి జొప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిపై ఓ న్యూస్ క్రియేట్ చేసి దాన్ని ఆన్‌లైన్ వేదికలపై వైరల్ చేశారు కొందరు సైబర్ కేటుగాళ్ళు. తాజాగా ఈ ఇష్యూపై మెగాస్టార్ స్వయంగా స్పందించారు. వివరాల్లోకి పోతే..

    శనివారం రోజు ప్రకటన.. ఆదివారం చూస్తే

    శనివారం రోజు ప్రకటన.. ఆదివారం చూస్తే

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అనే అంశంపై మొదట మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అనే అంశానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా శనివారం రోజు ప్రకటన జారీ చేశారు. కాగా అది వచ్చి ఒక్కరోజు పూర్తికాగానే ఆదివారం రోజు చిరంజీవి పేరుతోనే అందుకు విరుద్ధంగా మరో లేఖ నెట్టింట వైరల్ అయింది.

     రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నేను చేయలేదు

    రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నేను చేయలేదు

    ''యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు'' అని చిరంజీవి పేర్కొన్నట్లుగా ఆదివారం వచ్చిన లేఖలోని సారాంశం.

    మీడియా ముందు చిరంజీవి వివరణ

    మీడియా ముందు చిరంజీవి వివరణ

    మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్లుగా ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ లేఖపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందు వివరణ ఇచ్చారు. రాజధానులను సమర్థించినట్లుగా తాను శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని, ఆదివారం వచ్చిన ప్రకటన అవాస్తవమని.. అది తాను విడుదల చేసింది కాదు ఫేక్ అని చెప్పారు చిరంజీవి.

    సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

    సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

    మొత్తానికి వైఎస్ జగన్‌కి చిరంజీవి మద్దతు ఇస్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఓ వైపు తమ్ముడు పవన్.. జనసేన పార్టీతో పోరాడుతుండగా, ఇలా చిరంజీవి జగన్‌కి మద్దతుగా ఎందుకు మాట్లాడుతున్నారు? అందులో మర్మం ఏంటి? అని ఆరా దీస్తున్నారు జనం.

    మెగా 152

    మెగా 152

    ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన ఆయన, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 152 కోసం సిద్ధమవుతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా అతిత్వరలో సెట్స్ పైకి రానుంది.

    English summary
    One Fake letter rotating in social media with Chiranjeevi name. Now Chiranjeevi reated on this letter with media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X