రామ్ చరణ్ లొకేషన్ లో లెగ్గెటిన ‘చిరు’ నటించడం ఖాయం..
రామ్ చరణ్, జెనీలియా జంటగా నటిస్తున్న 'ఆరంజ్" చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ లొకేషన్ లోకి చిరంజీవి లెగ్ పెట్టాడట. కాసేపు అక్కడే ఉండి షూటింగ్ నంతా తిలకించి సరదాగా గడిపాడని సమాచారం. ఈ చిత్ర కథాయిక జెనీలియాతో కూడా చిరు చక్కగా మాట్లాడాడని సమాచారమ్. దాంతో జెనీలియా తెగ మురిసిపోతోంది. చిరంజీవి అంత పెద్ద హీరో అయినప్పటికీ తనతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడటం ఆశ్చర్యపరిచిందని, ఆయన చాలా గ్రేట్ మ్యాన్ అని జెనీలియా అంటోంది. అలాగే ఆయన మాకోసం ఆయన ఫాన్స్ కోసం ఒక చిత్రం చేస్తే చూడాలని వుంది అని సంబరపడిపోతోంది.
ప్రజారాజ్యం పెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటనకు దూరమై పోయారు. కానీ తన అభిమానుల కోరిక మేరకు మళ్ళీ నటిస్తాను అంటూ చిరు వచ్చిన ప్రతీ ఫంక్షన్ లోనూ చెబుతున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన 'రోబో" ఆడియో ఫంక్షన్ లో కూడా చిరంజీవి మాట్లాడుతూ.. మంచి కథ దొరికితే నటిస్తాను అన్నారు. తాజాగా ఓ చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అతని సన్నిహితులు చెపుతున్నారు.
ఇదిలావుంటే...'మున్నాభాయ్" సీక్వెల్ గా సంజయ్ దత్ 'మున్నాభాయ్ అమ్రికా చలే" చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎవరైనా మంచి దర్శకనిర్మాతలు తీసుకొని తెలుగులో రీమేక్ చేయడానకి ముందుకు వస్తే చిరంజీవి నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో..అన్నీ కుదిరితే చిరంజీవిని మళ్ళీ హీరోగా మనము చూడవచ్చన్నమాట


Click it and Unblock the Notifications











