ప్రజారాజ్యం పార్టీ అధినేత,తిరుపతి శాసన సభ్యుడు చిరంజీవి సిఫార్సుకు రెస్పాన్స్ లేకుండా పోయింది. హైదరాబాదుకు చెందిన ఇంజనీర్ నాగేంద్రప్రసాద్ శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చారు. తిరుపతిలో చిరంజీవి పీఏ వరప్రసాద్‌ను కలిసి రెండు కల్యాణాలకు సిఫార్సు లేఖ పొందారు. అయితే ఆ సిఫార్సుకు కల్యాణాలను కానీ ఇతర ఏ దర్శన టికెట్లను కానీ మంజూరుచేయలేదని నాగేంద్రప్రసాద్ వాపోయాడు.ఇప్పటివరకూ సిఫార్సు లేఖలివ్వని స్థానిక శాసన సభ్యుడి మొదటి లేఖ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయమని నాగేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వివరాలను మీడియా వారు కవర్ చేసారు. ఇది చిరంజీవికే అవమానం అన్నట్లు రాసుకొచ్చాయి. అధికారంలో వేరే గవర్నమెంట్ ఉండటంతో ఇలా జరిగిందంటూ కొందరు కామెంట్ చేసారు.