ఆయన విలువ తెలిసి అలా పిలవడం మానేశాను.. ఎస్పీబీపై చిరంజీవి కామెంట్స్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ (74) మరణంతో కుంగిపోయిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

Recommended Video

#SPBalasubramaniam : నా గుండె తరుక్కుపోతుంది.. SPB లేరన్న వార్తను తట్టులేకపోతున్నా! - Chiranjeevi
కోల్పోవడం చాలా దురదృష్టం

కోల్పోవడం చాలా దురదృష్టం

బాలు గారి విషయంలో ఏ వార్త అయితే వినకూడదనుకున్నామో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ని కోల్పోవడం చాలా దురదృష్టం. భారతీయ సంగీత ప్రపంచానికి ఇది ఒక దుర్దినం. చాలా బాధగా అనిపిస్తుంది.. గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి లెజెండరీ పర్సన్‌ని మనం మళ్లీ చూడగలమా.. చూడలేమని అనిపిస్తుంది. ఘంటసాల గారి తరువాత అంతటి గాయకుడు మళ్లీ బాలునే. బాలు స్థాయిని భర్తీ చేయాలంటే బాలునే పునర్జన్మ ఎత్తాలి అని చిరంజీవి తెలిపాడు.

నా విజయంలో ఆయనకు సింహభాగం

నా విజయంలో ఆయనకు సింహభాగం

నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు.. నేను అన్నయ్య అని పిలిచే నా కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్న భావం నాకు కలుగుతోంది. నాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. నా కెరీర్‌లో నా విజయంలో ఆయనకు సింహభాగం ఇవ్వాలి. నా సాంగ్స్ అంత పాపులర్ అవ్వటానికి కారణం అవి పాడిన బాలునే. సినిమా పరంగానే కాదు.. కుటుంబపరంగా కూడా మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం. చెన్నైలో పక్క పక్కన వీధుల్లో ఉండేవాళ్లం. తరుచూ కలుసుకుండేవాళ్లం. నా కెరీర్ తొలిదశ నుంచి నన్ను అక్కున చేర్చుకున్న ఆయన్ని అన్నయ్య అని పిలిచేవాణ్ని. తరువాత కాలంలో ఆయన ఎంత గొప్పవారో, గొప్ప స్థానంలో ఉన్నారో అర్థం చేసుకుని గౌరవప్రదంగా మీరు అని పిలచేవాణ్ని అని చిరంజీవి పేర్కొన్నాడు.

నీలోని నటుడికి కూడా అవకాశం ఇవ్వాలి

నీలోని నటుడికి కూడా అవకాశం ఇవ్వాలి

మొదటి నుంచి నన్ను అన్నయ్య అని పిలిచేవాడివి. ఇప్పుడు మీరు అని పిలిచిదూరం చెయ్యకు అని అనేవారు. ఇదే విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నువ్వు మంచి నటుడివి. కమర్షియల్ ఛట్రంలో ఇరుక్కుపోతున్నావ్ వద్దు.. నీలోని నటుడికి కూడా అవకాశం ఇవ్వాలి అని ఆయన సలహా ఇచ్చారు. ఆ సలహాల మేరకేనేమో నేను ఆపధ్భాంధవుడు, రుద్రవీణ, స్వయం కృషి.. ఇలాంటి సినిమాలు చేయగలిగాను.. అని చిరంజీవి వెల్లడించాడు.

ఏ రకంగా నేను నివాళి అర్పించగలను

ఏ రకంగా నేను నివాళి అర్పించగలను

నా పాటకు సరైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే కొద్ది మంది నటుల్లో చిరంజీవి ఒకరుఅని ఆయన చెప్పటం నాకు ఓ గొప్ప అవార్డుగా భావిస్తున్నాను. నా అన్నయ్యని పోగొట్టుకున్న బాధ తట్టుకోలేకపోతున్నాను. ఆ మహానుభావుడికి ఏ రకంగా నేను నివాళి అర్పించగలను. మళ్లీ బాలు లాంటి మనిషిని ఈ పరిశ్రమ పొందటం అన్నది దుర్లభం. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. బాలు తాను పాడిన పాటల ద్వారా ప్రతి రోజు మన గుండెల్లో ఉంటారు. మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలివుంటారు.. అమర్ రహే.. బాలు అమర్ రహే.. అని చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X