చిరంజీవి చీఫ్ గెస్ట్, ఎంపిక చేసిన ఫ్యాన్స్‌కే ఆహ్వానం!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జులై 29వ తేదీన ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నానకరాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరుగనుందని, ఈ వేడుకకు ఎంపిక చేసిన కొందరు అభిమానులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని సమాచారం.
చాలా కాలం తర్వాత చిరంజీవి ఇలా పబ్లిక్ ఈవెంటులో పాల్గొంటుండటంతో ఆహ్వానం అందిన అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మీటింగులో చిరంజీవి 150వ సినిమా విశేషాలు వెల్లడిస్తారని అభిమానుల భావిస్తున్నారు. మరి చిరంజీవి ఏయే విషయాలు వెల్లడిస్తారో చూడాలి.

భారీ తారాగణంతో కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ నటిస్తోంది. మరో నటుడు శ్రీకాంత్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నపారు. రామ్ చరణ్‌కు జోడీగా హీరోయిన్ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
'గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











