SP Balasubramanyam ఆరోగ్యంపై చిరంజీవి ఉద్వేగం.. నా అన్నయ్య అంటూ మెగాస్టార్ ఎమోషనల్
అభినవ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనావైరస్ పాజిటివ్‌కు గురై చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే బాలు ఆరోగ్యం మెరుగుపడిందనే వార్తలు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులను ఆనందానికి గురిచేస్తున్నాయి. భారతీరాజా, చిరంజీవి లాంటి ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకొంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసి బాలు కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..
Recommended Video

వైద్యానికి స్పందిస్తున్నారనే వార్తలు
కోట్లానుకోట్ల అభిమానుల గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోజు రోజుకు కోలోకుంటున్నారని, వైద్యానికి స్పందిస్తున్నారనే వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

వ్యక్తిగత, కుటుంబపరమైన అనుబంధం
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో సినిమా పరమైన అనుబంధమే కాదు కుటుంబపరమైన అనుబంధం ఉంది. చెన్నైలో పక్క పక్క వీదుల్లో ఉంటూ తరచు కలుసుకొంటూడే వాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది. తనను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటాను. ఆయన చెల్లెల్లు వసంత, శైలజ నన్ను అన్యయ్య అంటూ ఆప్యాయంగా చూసుకొంటారు అని ఎస్పీ బాలు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి పంచుకొన్నారు.

కళామతల్లికి మరింత సేవ చేయాలని
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి గురించి శైలజ, వసంత, శుభలేఖ సుధాకర్‌కు ఫోన్ చేసి రోజు తెలుసుకొంటున్నాను. బాలు ఆరోగ్య రోజు రోజుకు మెరుగుపడుతున్నదనే విషయం నాకు చాలా సంతోషం కలిగించాయి. త్వరగా బాలు కోలకొని మనతో కలిసి కళామతల్లికి మరింత సేవలు చేయాలని ఆశిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

అమృత గళం కోటి రాగాలు పలకాలి
తెలుగు సినిమా పరిశ్రమకు ఎస్పీ బాలసుబ్రమణ్యం అమృతగళం. భారతీయ సినిమా పరిశ్రమకు ఆయన ఊపిరి రాగం, తానం, పల్లవి. త్వరగా కోలుకొని ఆ గళం విప్పాలని, కోటి రాగాలు పలికించాలని, భారతీయులందరినీ ఉర్రూతలూగించాలని ఆయనకు ఉన్న కోట్లాది మంది అభిమానులతోపాటు నేను కోరుకొంటున్నాను. అందరి ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులు కోలుకొనేలా చేస్తుంది. ముందుకంటే మరింత ఎక్కువగా అభిమానులను రెట్టింపు ఉత్సాహంతో, ఆలరించాలని భగవంతుడిని వేడుకొందాం అని చిరంజీవి ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











