చిరంజీవికి చేదు అనుభవం: నువ్వేమైనా సూపర్ స్టారా అంటూ పరువు తీసిన ప్రొడ్యూసర్
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ.. నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా ప్రాజెక్టులను చేస్తూ సత్తా చాటుతోన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఈవెంట్లలో కూడా పాల్గొంటున్నారు. ఇలా తాజాగా ఆయన డిజిటల్ క్రియేటర్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గతంలో తనను ఓ ప్రొడ్యూసర్ అవమానించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
విజయ్‌తో కలిసి చిరంజీవి:డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో డిజిటల్ క్రియేటర్స్ మీట్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ గెస్టులుగా వచ్చారు. వీరితో పాటు సోషల్ మీడియా వల్ల సెన్సేషన్ అయిన ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. దీంతో ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది.

చిరుకు విజయ్ ప్రశ్నలు:డిజిటల్ క్రియేటర్స్ మీట్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తనదైన స్టైల్‌లో చిరంజీవిని స్టేజ్ మీదకు ఆహ్వానించాడు. ఆ సమయంలో అతడు ఇచ్చిన ఎలివేషన్స్ గూస్‌బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని విజయ్ కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగాడు. వీటన్నింటికీ ఆయన సమాధానాలు చెప్పి అనుభవాలను పంచుకున్నారు.
లేట్ అయిందని అరిచి:ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. 'న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోంది. రాధిక, శారద, జగ్గయ్య వంటి పెద్ద వారితో కోర్టు సీన్ చేయాల్సి ఉంది. అప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ రోప్‌తో మీద ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అయిందని చెప్పడంతో.. నేను వెళ్లి బోనులో నిల్చున్నాను. దీంతో ఇంత లేటుగా వచ్చానని నిర్మాత అరిచారు' అని చెప్పారు.

స్టార్‌వు అనుకున్నావా?:ఆ తర్వాత చిరంజీవి కంటిన్యూ చేస్తూ.. 'నువ్వేమైనా పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నీ కోసం ఇంత మంది వెయిట్ చేయాలా అని అందరి ముందే అరిచారు. అలా పైనుంచి అరిచేస్తుండటంతో వందల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య నాకు ఏదోలా అనిపించింది. ఈయనేంటి ఇలా అన్నాడు అని చాలా బాధగా అనిపించింది' అంటూ గుర్తు చేసుకున్నారు.
కసితోనే స్టార్‌ను అయ్యా:మెగాస్టార్ చిరంజీవి కొనసాగిస్తూ.. 'ఆ సంఘటన జరిగిన రోజు సాయంత్రం క్రాంతి కుమార్ ఫోన్ చేసి ''శారద రీల్స్ బాగా తినేస్తోంది. ఆ కోపంలో ఏదో అన్నాను సారీ'' అన్నారు. కానీ క్రాంతి కుమార్ అన్న మాటల్లో ఓ మాటను మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నా. నువ్వేమైనా పెద్ద స్టార్ అని అనుకుంటున్నావా? అని అన్నారు కదా? స్టార్ అయి చూపించాలని చేశా' అని పేర్కొన్నారు.

పాజిటివ్‌గానే ఉండాలి:చివర్లో చిరంజీవి 'నాకు జరిగినట్లుగా ఎవరైనా అన్నా.. అవమాన పర్చినా.. నిరుత్సాహ పర్చినా కూడా రెట్టింపు ఉత్సాహం, కసితో పని చేయాలి. పాండీ బజార్‌లో ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుండేవి. అందుకే అటు వైపు వెళ్లేవాడ్ని కాదు. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్‌తోనే ఉండాలి' అంటూ సలహాలు ఇచ్చారు. చిరంజీవి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











