ప్రాణదాతలు కండి.. దయచేసి దానం చేయండని వేడుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాను వాడినంతగా, వాడుతున్నంతగా ఎవ్వరూ వాడటం లేదు. ఎంటర్టైన్మెంట్‌కు ఎంటర్టైన్మెంట్‌... సామాజిక అవగాహన కల్పిస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. చిరంజీవి ఓ ట్వీట్ వేశారంటే.. అది ఎంతగానో వైరల్ అవుతుంది. మంచి పనులు ఎవరు చూసినా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తారు. ప్రత్యేకంగా అభినందలు కూడా తెలుపుతారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఎంతగానో అవగాహన కలిగిస్తున్నారు.

ఈ మధ్య మాస్క్ ధరించడం ఎంత ఆవశ్యకమో తెలిపేలా ఓ సందేశాన్ని ఇచ్చారు. హీరో కార్తికేయ, హీరోయిన్ ఈషా రెబ్బాలతో కలిసి అందరినీ జాగురూకత చేసేలా ఓ మెసెజ్ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మాస్క్ ధరించాలని, అదే అందరికీ క్షేమమని చెప్పుకొచ్చారు. తాజాగా మరో ట్వీట్ చేశారు. సీసీ సజ్జనార్ వీడియోను షేర్ చేస్తూ.. ప్లాస్మా దానం ప్రాముఖ్యతను అందరికీ తెలిపారు.

 Chiranjeevi Request To All Covid 19 recovered Patients Donate Plasma

కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మాను దానం చేయండి, తద్వారా అవసరాల్లో ఉన్నవారిని కాపాడండని సైబరాబాద్ పోలీస్ కమీషన్ అందరినీ వేడుకుంది. ఈ వీడియోను చిరంజీవి షేర్ చేస్తూ.. పక్కవారి ప్రాణాలను కాపాడేందుకు కోవిడ్ నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలని, ప్లాస్మా దానం చేయాలని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే మానవత్వం చూపాలని, యోధుల్లా మారి ప్రాణాలను కాపాడాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X