HanuMan: గుంటూరు కారం వివాదంపై చిరంజీవి రియాక్షన్.. బాలయ్య, దిల్ రాజును లాగుతూ ఊహించని వ్యాఖ్యలు
సాధారణంగా ప్రతి సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. ఈ సారి కూడా టాలీవుడ్‌లో నాలుగు క్రేజీ మూవీలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. అందులో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'హనుమాన్' ఒకటి. చిన్న సినిమాగా మొదలై దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్న ఇది.. జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. అయితే, దీనికి థియేటర్ల సమస్య తలెత్తడం పెద్ద వివాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈవెంట్‌లో చిరంజీవి దీనిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసమే!
Recommended Video

హనుమాన్‌గా మారిన తేజ : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వర్క్ చేశారు.
గ్రాండ్‌గా మూవీ ఈవెంట్ : సూపర్ హీరో స్టోరీతో రూపొందిన 'హనుమాన్' మూవీని జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చిన ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.
హనుమంతుడి బంధం : 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ముందుగా హనుమంతుడితో తనకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ఆంజనేయ స్వామి ప్రభావం తనపై ఎలా ఉంది అనేది వివరించారు. ఆ తర్వాత 'హనుమాన్' మూవీ గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే హీరో, డైరెక్టర్ సహా అందరినీ చిరంజీవి అభినందించారు.

కంటెంట్ బాగుండాలి : 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి థియేటర్ల వివాదంపై స్పందించారు. ఈ మేరకు ఆయన 'డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజల కష్టం ఏమాత్రం వృథా కాదు. ఈ సంక్రాంతి సీజన్ చాలా మంచి సీజన్. ఈ సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా సరే కంటెంట్ బాగుంది అంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. కచ్చితంగా అక్కున చేర్చుకుంటారు' అని చెప్పుకొచ్చారు.
థియేటర్లు లేకపోయినా : ఇదే ఈవెంట్‌లో చిరంజీవి స్పీచ్ కంటిన్యూ చేస్తూ.. 'ఈ హనుమాన్ సినిమాకు థియేటర్లు అనుకున్న విధంగా లభించకపోయి ఉండవచ్చు. ఇట్స్ ఓకే.. సినిమా బాగుంది అని జనం నమ్మితే ఈరోజు కాకపోతే రేపు చూస్తారు.. రేపు కాకపోతే తర్వాత రోజు చూస్తారు. ఎలాగైనా సినిమాను చూసి ఆదరిస్తారు. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు' అని భరోసాను అందించారు.

దిల్ రాజు మాటలతో : చిరంజీవి కొనసాగిస్తూ.. '2017లో ఖైదీ నెంబర్ 150తో పాటు బాలకృష్ణ గారి సినిమాలు వచ్చాయి. అప్పుడు దిల్ రాజుతో ఇప్పుడు మీ మూవీ ఎందుకు అంటే.. కంటెంట్ మీద నమ్మకం ఉంది అని చెప్పారు. అలాగే, ఆ టైంలో శతమానంభవతిని రిలీజ్ చేశారు. ఆయన చెప్పినట్లే ఆడింది. ఇప్పుడు కూడా మీ హనుమాన్ మూవీ అలాగే ఆడుతుందని నమ్మకం ఉంది' అని ముగించారు.


Click it and Unblock the Notifications











