ఎట్టకేలకు సైరా వివాదంపై స్పందించిన చిరంజీవి.. ఉసిగొల్పి పంపించారంటూ!

Recommended Video

Sye Raa Narasimha Reddy : Chiranjeevi Finally Responded On Sye Raa Movie Controversy !

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' పై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రోజు రోజుకూ ముదురుతూ వచ్చిన ఈ వివాదం చివరకు కోర్ట్ కేసు వరకూ వెళ్ళింది. తమను మోసం చేశారంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు పెద్ద ఎత్తున ఆదోళనలకు దిగారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయమై ఇప్పటిదాకా స్పందించని మెగాస్టార్ తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి స్పందించారు. ఆ వివరాలు చూద్దామా..

వాళ్ళు అమాయకులు.. కావాలనే ఇదంతా

వాళ్ళు అమాయకులు.. కావాలనే ఇదంతా

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులని, వారిని వేరెవరో ఉసిగొల్పి తమ మీదకు పంపారని అన్నారు చిరంజీవి. నిజానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని.. అందుకే మీ ఊరికి కానీ, మీకు కానీ ఏదైనా చేద్దామని రామ్ చరణ్ అన్నదాని చెప్పారు చిరు. ఈ మేరకు వారికి ఆర్ధిక సహాయం వ్యవహారం ఓ వ్యక్తికి కూడా అప్పజెప్పామని అన్నారు.

 డిమాండ్ చేయడం మొదలెట్టారు

డిమాండ్ చేయడం మొదలెట్టారు

అయితే వాళ్ళు మాత్రం పాతిక కుటుంబాలున్నాం, ఒక్కో కుటుంబానికి రెండు కోట్ల చొప్పున మొత్తం యాభై కోట్లు కావాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారని.. ఇది సబబు కాదని చెప్పారు చిరంజీవి. నిజానిజాలు తెలుసుకోకుండా పెద్ద ఎత్తున మీడియా ప్రచారం జరిగిందని, అలా వివాదం బాగా ముదిరిందని ఆయన అన్నారు.

ఇంకొందరు ఉయ్యాలవాడ వంశీయులు వచ్చి..

ఇంకొందరు ఉయ్యాలవాడ వంశీయులు వచ్చి..

ఇదిలా ఉంటే ఉయ్యాలవాడ వంశీకులు మరికొందరు వచ్చి, కేవలం ఒక ప్రాంతానికే మాత్రమే పరిమితమైన మా వంశీకుడి చరిత్రను ప్రపంచానికి మొత్తానికీ తెలిసేలా చేస్తున్నారు. డబ్బుకు కక్కుర్తిపడిన మా వాళ్ళలో కొందరిని క్షమించండి అని అన్నారని చిరు తెలిపారు. కావాలంటే.. అంతా సిద్ధమయ్యాక రిలీజుకు ముందు వాళ్ళ ప్రతినిధులు వచ్చి, సినిమా చూస్తామన్నా అభ్యంతరం లేదు. అంతేకానీ వాళ్ళు ఇలా డబ్బులు డిమాండ్ చేయడం సరికాదని ఆయన చెప్పారు.

వందేళ్ళయిన తరువాత ఎవరి కథ అయినా

వందేళ్ళయిన తరువాత ఎవరి కథ అయినా

అయినా వందేళ్ళయిన తరువాత ఎవరి కథ అయినా, అది చరిత్రే అవుతుందని అని కోర్టు చెప్పిందని చిరు అన్నారు. చివరకు స్వాతంత్య్ర యోధుడు ‘మంగళ్‌ పాండే' సినిమా విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, అరవై ఏళ్ళయితే చాలని చెప్పిందని.. సో దాని మీద వారసులకు హక్కు ఉండదని చిరు పేర్కొనడం విశేషం.

ఆ ప్రాంతానికి ఏదైనా చేస్తాం

ఆ ప్రాంతానికి ఏదైనా చేస్తాం

అయినా అప్పట్లో రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ కానీ, ఇటీవల పద్మావత్‌ సినిమా కానీ, మణికర్ణిక సినిమా కానీ ఎవరికైనా డబ్బులిచ్చి తీశారా? సైరా విషయంలో ఎందుకిలా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ విడుదలయ్యాక 'సైరా'కు బాగా లాభాలు వస్తే, ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలని భావిస్తున్నామని చిరంజీవి తెలిపారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X