హైదరాబాద్ కు తిరిగివచ్చిన చిరు
చిరంజీవి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇబ్బందులపాలయిన చిరంజీవి ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లాడు. నవంబర్ 10న చెన్నయ్ కు వచ్చిన చిరంజీవి హైదరాబాద్ కు వచ్చేదాకా అక్కడే ఉన్నాడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన పొల్లదవన్ సినిమాను కూడా చిరంజీవి దేవిశ్రీదేవి ప్రివ్యూ థియేటర్ లో వీక్షించాడు. పెద్దకూతురు ఉండేది చెన్నయ్ కావడంతో ఆయన అక్కడ దాదాపు వారం రోజులు అక్కడ ఉన్నాడు. శనివారం హైదరాబాద్ కు ఆయన చేరుకున్నాడు. మీడియాతోనే కాకుండా దగ్గరి స్నేహితులతో కూడా మాట్లాడటానికి విముఖత చూపుతున్న చిరంజీవి తన కూతురు ప్రేమ వివాహం తరువాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీజ పెళ్లి తరువాత మీడియా ముందు ప్రత్యక్షమై చిరంజీవికి ఇబ్బందికరమైన ప్రకటనలు ఇవ్వడం ఢిల్లీకి వెళ్లిన తరువాత కూడా వాటిని కొనసాగించడం చేశారు. ఇదిలా ఉంటే శ్రీజ పెళ్లి వెనకాల కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నట్టు త్వరలో వారి పేర్లను కూడా బయటపెడతానని తెలుగుదేశం మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి మీడియాకు చెప్పిన నేపథ్యంలో ఈ పెళ్లికి రాజకీయ రంగు పులుముకుంది.


Click it and Unblock the Notifications











