Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అందుకే త్రిష తప్పుకుంది.. అసలు విషయం చెప్పిన చిరంజీవి.. నాడు చెప్పిన కారణాలు అబద్దమా?
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ఆచార్య అని చిరంజీవే స్వయంగా చెప్పేశాడు. ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరు ప్రసంగిస్తూ నోరు జారేశాడు. దీంతో అప్పటి వరకు వచ్చిన రూమర్సే నిజమై.. ఆచార్య అనే టైటిల్ చిరు నోటి నుంచి వచ్చేసింది. అయితే నిత్యం ఏదో ఒక వార్తతో ఆచార్య సినిమా హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య త్రిష తప్పుకోవడం, దానికి ఆమె చెప్పిన కారణాలు తెగ వైరల్ అయ్యాయి. ఆ విషయమై చిరు తాజాగా స్పందించి మరో కొత్త వివాదానికి తెరదీశాడు. ఇంతకీ చిరు ఏం చెప్పాడో ఓ సారి చూద్దాం.
చిరుకు జోడిగా త్రిష..
ఆచార్య ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పటి నుంచి హీరోయిన్ విషయంలో ఏదో ఒక సందిగ్దత ఉంటూనే వచ్చింది. మొత్తంగా చిరు పక్కన త్రిష నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఆమె సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడమే తప్పా.. ఆచార్యలో త్రిష హీరోయిన్ అని ఎవ్వరూ అధికారికంగా ప్రకటించనే లేదు.
క్రియేటివ్ డిఫరెన్సెస్..
తాను చిరంజీవి సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది త్రిష. ముందు చెప్పింది వేరులా ఉందని, ఇప్పుడు చేసేది వేరేలా ఉందని చెప్పుకొచ్చింది. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా అంటూ క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లే సినిమా నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది.
అంతా అదే నిజమని అనుకున్నారు..
అయితే త్రిష చెప్పిన కారణాలు అప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఆమె చెప్పినవి నిజమేననిపించాయి. చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటించడం, చెర్రీ సరసన మరో హీరోయిన్ జత కావడంతో త్రిష పాత్ర తగ్గిందని అందుకే హర్ట్ అయిందని, సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి.
Recommended Video
మణిరత్నం సినిమాలో ఛాన్స్ రావడంతో..
త్రిష తప్పుకోవడానికి గల కారణాలు చెప్పి.. కొత్త వివాదానికి తెరలేపాడు చిరంజీవి. మణిరత్నం సినిమాలో ఛాన్స్ రావడం, ఆ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయడం కోసమే త్రిష తప్పుకుందని అసలు విషయం బయట పెట్టేశాడు. యూనిట్లో ఏ ఒక్కరితో విబేధాలు లేవని, కేవలం ఆ సినిమా కోసమే తప్పుకుందని చిరు చెప్పుకొచ్చాడు.