twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’ మూవీ యూత్ ఎందుకు చూడాలి? చిరంజీవిని ప్రశ్నించిన ఉపాసన

    |

    Recommended Video

    Upasana Konidela Redefines Chiranjeevi's Age With Bpositive Cover | Syeraa Narasimha Reddy

    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2019లో టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    అపోలో లైఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవి కోడలు ఉపాసన బి పాజిటివ్ అనే హెల్త్ మేగజైన్ సైతం రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 2019 సంచిక కవర్ పేజీపై ఈ సారి చిరంజీవి దర్శనమిచ్చారు. ఈ సంచికలో మెగాస్టార్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మామగారి నుంచి సైరా మూవీకి సంబంధించిన విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేశారు ఉపాసన.

    ‘సైరా' మూవీ యూత్ ఎందుకు చూడాలి? అని ప్రశ్నించిన ఉపాసన

    ‘సైరా' మూవీ యూత్ ఎందుకు చూడాలి? అని ప్రశ్నించిన ఉపాసన

    ఇంటర్వ్యూలో భాగంగా ‘సైరా మూవీని యూత్ ఎందుకు చూడాలి' అనే పశ్న సంధించారు ఉపాసన. దీనికి చిరంజీవి స్పందిస్తూ... ‘ఇది ఈ తరం యువత చూడాల్సిన ముఖ్యమైన సినిమా, మన కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలను గురించి చెప్పే సినిమా' అని తెలిపారు.

    వారి త్యాగాల ప్రతి ఫలం మనం అనుభవిస్తున్నాం

    వారి త్యాగాల ప్రతి ఫలం మనం అనుభవిస్తున్నాం

    ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ప్రతి ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ ఈ చిత్రం ఉంటుంది.'' అని మెగాస్టార్ వెల్లడించారు.

    భారీ బడ్జెట్‌తో సైరా

    భారీ బడ్జెట్‌తో సైరా

    1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించారు. ఇందు కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు అంచనా. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం వెల్లడించింది. అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్.

    సైరా నరసింహారెడ్డి

    సైరా నరసింహారెడ్డి

    ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా'ను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Chiranjeevi reveals interesting details about Sye Raa in Upasana B positive interview. “Sye Raa film pays tributes to the legend who sacrificed his life to attain Independence for the country. We are enjoying the fruits of freedom due to their sacrifices,” Chiranjeevi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X