For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను ఆఫర్‌ ఇస్తే సాయి పల్లవి రిజెక్ట్ చేసింది... అసలు విషయాన్ని బయటపెట్టిన చిరంజీవి

  |

  నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో ప్రసంగించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించిన చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి టాలెంట్‌పై కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

  టోక్యోలో అమీర్ ఖాన్‌తో కలిసి

  టోక్యోలో అమీర్ ఖాన్‌తో కలిసి

  నా చిరకాల మిత్రుడు అమీర్ ఖాన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో టోక్యో ఎయిర్‌పోర్టులో కలిసిన సమయంలో ఆత్మీయంగా మాట్లాడుకొన్నాం. అప్పుడు ఫారెస్ట్ గంప్ సినిమాను రీమేక్ చేస్తున్నానని చెబితే నేను షాక్ గురయ్యాను. ఆస్కార్ రేంజ్ హాలీవుడ్ సినిమాను తెరకెక్కించడమంటే సులభమైన విషయం కాదు. ఆ చిత్రంలో నా స్నేహితుడు నాగార్జున కుమారుడు నాగచైతన్య నటించడం ఇంకా హ్యాపీగా ఉంది అని చిరంజీవి అన్నారు

  చైతూ కూల్ గయ్.. అంటూ

  చైతూ కూల్ గయ్.. అంటూ

  నాగచైతన్య గురించి చిరంజీవి మాట్లాడుతూ.. తన కెరీర్‌ను చాలా కంపోజ్‌డ్‌గా కొనసాగిస్తున్నారు. చైతూ చాలా కూల్ గయ్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొంటూ ముందుకెళ్తున్నాడు. లవ్ స్టోరి చిత్రం మంచి విజయం అందుకొంటుందనే నమ్మకం ఉంది. సాయిపల్లవితో డ్యాన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడి డ్యాన్స్ చేసినట్టు కనిపించింది అని అన్నారు.

   నా ఆఫర్‌ను సాయిపల్లవి రిజెక్ట్ చేసింది..

  నా ఆఫర్‌ను సాయిపల్లవి రిజెక్ట్ చేసింది..

  ఇక సాయిపల్లవితో నటించాలని నా సినిమాలో ఆఫర్ ఇచ్చాను. నేను నటించబోయే సినిమాలో చెల్లెలు పాత్ర చేయమంటే రిజెక్ట్ చేశారు. అయితే నాతో చెల్లెలు పాత్రలో నటించనని ఆమె చెప్పడం నాకు చాలా సంతోషం ఉంది. గొప్ప డ్యాన్సర్ అయిన సాయిపల్లవితో స్టెప్పులు వేయాలని అనుకొన్నాను. ఆమె నాకు చెల్లెల్లిగా నటించడం ఇష్టం లేదు అని చిరంజీవి అన్నారు. ఫిదా సినిమాలో ఆమె నటన చూసిన తర్వాత మరింత ఇష్టం పెరిగింది. ఆ సినిమా చూసినప్పుడు వరుణ్ వచ్చి ఎలా ఉందని అడిగితే.. నేను నిన్ను చూడలేదు. సాయిపల్లవినే చూశాను అని చెప్పాను అని చిరంజీవి అన్నారు.

   చిరంజీవితో తప్పకుండా నటిస్తానని.. సాయిపల్లవి

  చిరంజీవితో తప్పకుండా నటిస్తానని.. సాయిపల్లవి

  అయితే తన సినిమాలో నటించనని చెప్పిన విషయాన్ని చిరంజీవి చెప్పగానే.. నా ఉద్దేశం అది కాదు. చిరంజీవితో చెల్లెలు నటించడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒప్పుకోలేదు. మీరు ఆఫర్ ఇస్తే నెక్ట్స్ సినిమాలో మీతో నటిస్తాను అని సాయిపల్లవి అన్నారు.

   శేఖర్ కమ్ముల గొప్ప డైరెక్టర్..

  శేఖర్ కమ్ముల గొప్ప డైరెక్టర్..

  అలాగే చాలా ఏళ్ల క్రితం ఆరు అడుగుల రెండు అంగులాల వ్యక్తి పరిచయం అయ్యారు. అప్పుడు నిన్ను చూసి, మీ సినిమాలు చూసి పెరిగాను అని చెప్పాడు. కానీ ఎవరి వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు. సెన్సిబుల్ సినిమాలు చేసి గొప్ప డైరెక్టర్‌గా అందరి చేత ప్రశంసలు అందుకొంటున్నారు అని చిరంజీవి పేర్కొన్నారు.

  Sidharth Shukla Biography ఆ రాత్రి ఏం జరిగింది.. ప్రేయసి గుండెబద్ధలు || Filmibeat Telugu
   లవ్ స్టోరి నిర్మాత

  లవ్ స్టోరి నిర్మాత

  లవ్ స్టోరి నిర్మాత నారాయణదాస్ నారంగ్ గారు నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులు. ఆయన 80వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి చ్చినప్పటి నుంచి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాకు గురువులా భావిస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారు. ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరం. మీలాంటి వాళ్లు ప్రొడక్షన్ లోకి రావాలి. సినిమాలు నిర్మించాలి. సి��ిమా విలువ మరింత పెంచాలి. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నారాయణదాస్ గారి అబ్బాయి సునీల్ తండ్రిని మించిన తనయుడు. చాలా స్మార్ట్. వాళ్ల కృషి లేకుంటే పంపిణీ రంగంలో, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఇన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేవి కావు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లే అని చిరంజీవి అన్నారు.

  English summary
  Chiranjeevi, Aamir Khan graced the Love Story Unplugged Event. In this occassion, Chiranjeevi gets emotional talking about Aamir Khan, Chaitanya Akkineni and Sai Pallavi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X