దాసరి గుట్టువిప్పిన చిరంజీవి.. మూడు ముక్కల్లో చెప్పడం కష్టం
Recommended Video

ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు జీవితంలోని కొన్ని విశేషాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొంటూ అందించిన పుస్తకం తెర వెనుక దాసరి. ఈ పుస్తకంలో చిరంజీవి, మోహన్‌బాబు, మురళీ మోహన్, వీవీ వినాయక్, అల్లు అరవింద్ తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు తమ అనుభావాలను వ్యాసాల రూపంలో పంచుకొన్నారు. దాసరిని స్మరించుకొంటూ మెగాస్టార్ చిరంజీవి రాసిన వ్యాసంలోని కొన్ని ముఖ్య అంశాలు మీకోసం..

దా.స.రి.కి కొత్త భాష్యం
గొప్ప వ్యక్తుల గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే కష్టం. దా.స.రి అనే మూడు అక్షరాలు అంటే దా అంటే దాతృత్వం, స అంటే సమర్ధత, రి అంటే రెవ్యల్యూషనరీ (విప్లవాత్మక భావాలు) అని అర్థం.

దాతృత్వంలో దాసరి మేటి
దాసరి నారాయణరావు ఎన్ని ఘన విజయాలు సాధించినా సంచనాలు సృష్టించినా, ఉన్నత పదవులు చేపట్టినా ప్రజల్లో గుండెల్లో దక్కని చోటు కేవలం దాతృత్వంతోనే వచ్చింది.

50 విస్తర్లు పరువకుండా
సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోజు నుంచి చూస్తున్నాను. దాసరి ఇంట్లో 50 తక్కువ కాకుండా విస్తర్లు పరువకుండా రోజు గడిచేది కాదు. తనను కలువడానికి వచ్చిన వారు కడుపు నిండా తిని వెళ్లాలనే మనస్తత్వం దాసరి గారిది.

దాతృత్వం కేవలం
కేవలం ఆయన దాతృత్వం అన్నదానానికే పరిమితం కాలేదు. అన్ని దానాల్లోనే ఆయన మార్కు కనిపించేది. చిత్ర పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చేవారు. కష్టాలు తీరే వరకు వారికి అండగా నిలిచేవారు.

అద్భుతమైన దర్శక ప్రతిభతో
సమర్ధత విషయానికి వస్తే పెద్ద హీరోలు, కొత్త హీరోల సినిమాలైనా దాసరి మార్కు తప్పనిసరిగా కనిపించేది. అన్ని శాఖలపై ఆయనకు పట్టు ఉండేది. ప్రతీ టెక్నిషియన్ నుంచి పని రాబట్టుకునే వారు. దర్శకత్వ ప్రతిభను జోడించి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే వారు.

స్వయంగా రచయితగా టాలెంట్
తాను రాసుకొన్న కథనకు తానే దర్శకత్వం వహించే విప్లవాత్మకమైన మార్పు దాసరిగారితోనే ప్రారంభమైంది. కొన్నిసార్లు రచయిత నుంచి స్క్రిప్టు రాకపోయినా తానే స్వయంగా రంగంలోకి దిగి కావాల్సిన ఫలితాన్ని రాబట్టుకొన్నారు.

సినిమాలో డైలాగ్సే హీరోలు
సాధారణంగా కొన్నిసార్లు హీరోలు చెప్పే డైలాగ్స్ పాపులర్ అవుతాయి. కానీ దర్శకుడిగా దాసరి రాసిన మాటలు సినిమాకు హీరోగా మారాయి. శివరంజని చిత్రాన్ని తీసిన చేతితోనే ఓ మేఘ సందేశం, తాండ్ర పాపారాయుడు లాంటి సినిమాలను తీయగలిగారు అని చిరంజీవి అన్నారు. ఇలాంటి ఎన్నో విషయాలను తన వ్యాసంలో చిరంజీవి ప్రస్తావించడం గమనార్హం.

దాసరి అంటే చరిత్ర
ఇలాంటి వ్యాసాలు ఎన్నో ఉన్న తెర వెనుక దాసరి పుస్తకాన్ని చిరంజీవి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. దాసరి మాట్లాడితే ఓ చరిత్ర.. దాసరి అడుగు వేస్తే ఓ సంచలనం.. ఆయన నిర్ణయాలు ఓ హిస్టరీ అని చిరంజీవి అన్నారు.

పుస్తకం అందరికీ స్ఫూర్తి
తెర వెనుక దాసరి పుస్తకం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. నేనేదో సాధించాను అనుకుని ఈ పుస్తకం చదివితే ఇంకా ఏదో సాధించాలి అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకే కాదు సినిమాని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకం తెరిస్తే మళ్ళి కొత్తగా ఇంకా ఏదో సాధించాలి అనే ఆలోచనల్లో పడతారు అంటు పుస్తకంలో వున్నా అంశాలను గురించి వివరించారు.


Click it and Unblock the Notifications











