‘వకీల్ సాబ్’పై చిరంజీవి రివ్యూ: పవన్‌పై ఊహించని కామెంట్.. ఇక్కడే కాదు అక్కడా గెలుస్తాడంటూ ఎమోషనల్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడతను. అందుకే కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో రాజకీయాల కోసం సినిమాకు బ్రేకిచ్చాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పవన్ మూవీపై చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఆ సంగతులు మీకోసం!

అందుకోసం గ్యాప్.. ఇలా రీఎంట్రీ ఇచ్చిన పవన్

అందుకోసం గ్యాప్.. ఇలా రీఎంట్రీ ఇచ్చిన పవన్

రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సినిమాలకు విరామం ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు.

అన్ని చోట్లా ఒకే రకమైన టాక్.. కమ్‌బ్యాక్ ఫిల్మ్

అన్ని చోట్లా ఒకే రకమైన టాక్.. కమ్‌బ్యాక్ ఫిల్మ్

'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అయింది. మరికొన్ని చోట్లా ఇది స్పెషల్‌గా వేశారు. ఇక, అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు.

వాళ్లంతా అదుర్స్.. ఎక్కువ మార్కులు అతడికే

వాళ్లంతా అదుర్స్.. ఎక్కువ మార్కులు అతడికే

'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అంతలా అతడు ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. ఇక, దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చక్కని ప్రతిభను కనబరిచాడు. హీరోయిన్లు అంజలి, నివేదా, అనన్య పోటీ పడి నటించారు. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగే మెప్పించాడు.

ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్.. సక్సెస్ సంబరాలు చేస్తూ

ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్.. సక్సెస్ సంబరాలు చేస్తూ

దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గ్యాప్ ఇచ్చినా పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అయ్యేలా సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన, టాక్ వస్తుండడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అలాగే, పల్లెల నుంచి పట్టణాల వరకూ ఉన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

‘వకీల్ సాబ్' సినిమాను చూసిన మెగా ఫ్యామిలీ

‘వకీల్ సాబ్' సినిమాను చూసిన మెగా ఫ్యామిలీ


శుక్రవారం రాత్రి 'వకీల్ సాబ్' సినిమాను మెగా ఫ్యామిలీ మొత్తం వీక్షించింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, తల్లి అంజనాదేవి కలిసి వీక్షించారు. వీళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు.. ఆయన సతీమణి, హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఈ చిత్రాన్ని తిలకించారు. అభిమానుల కేరింతల నడుమ వీళ్లు సినిమా చూసి మరింత జోష్‌ను నింపారు.

పవన్ కల్యాణ్ సినిమాపై చిరంజీవి మెగా రివ్యూ

పవన్ కల్యాణ్ సినిమాపై చిరంజీవి మెగా రివ్యూ

ముందుగా చెప్పినట్లుగానే శుక్రవారం రాత్రి 'వకీల్ సాబ్' సినిమాను చూశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై తన రివ్యూను చెప్పారు. 'ప్రకాశ్ రాజ్‌తో పవన్ కల్యాణ్ కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంది. హీరోయిన్లు ముగ్గురూ వాళ్ల పాత్రల్లో జీవించారు. అందరికీ శుభాకాంక్షలు. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలిపే ఒక అత్యవసర చిత్రం' అంటూ ట్వీట్ చేశారు.

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడా గెలుస్తాడంటూ

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడా గెలుస్తాడంటూ

ఇక, ఇదే ట్వీట్‌లో తన సోదరుడు పవన్ కల్యాణ్ గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. 'మూడు సంవత్సరాల తర్వాత కూడా పవన్ కల్యాణ్‌లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు.. అందరి మనసులనూ గెలుస్తాడు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X