For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kondapolam మూవీపై చిరంజీవి రివ్యూ: ఒకే ఒక్క ట్వీట్‌తో మొత్తం రివీల్ చేసేసిన మెగాస్టార్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీల నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అందులో మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం పంజా వైష్ణవ్ తేజ్ మాత్రమే. మొదటి చిత్రంతోనే రికార్డులపై దండయాత్ర చేసిన అతడు.. ఇప్పుడు 'కొండపొలం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఈ మూవీపై రివ్యూ ఇచ్చారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  బాక్సాఫీస్‌పై ‘ఉప్పెన' పుట్టించి

  బాక్సాఫీస్‌పై ‘ఉప్పెన' పుట్టించి

  చిరంజీవి మేనల్లుడైన వైష్ణవ్ తేజ్.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేసిన చిత్రం 'ఉప్పెన'. ప్రేమకథ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయింది. తద్వారా ఈ యంగ్ హీరో.. మొదటి సినిమాతోనే యాభై కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయి టాలీవుడ్‌లో రికార్డును క్రియేట్ చేశాడు.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  క్రేజీ కాంబినేషన్‌లో ‘కొండపొలం'

  క్రేజీ కాంబినేషన్‌లో ‘కొండపొలం'

  మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'కొండపొలం'. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాను రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందించారు. ఇది నేడు విడుదల కాబోతుంది.

  భారీ అంచనాలు... బిజినెస్ కూడా

  భారీ అంచనాలు... బిజినెస్ కూడా

  'ఉప్పెన' మూవీతో భారీ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. అతడు నటించిన చిత్రం.. దీనికితోడు దీన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించడంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మధ్య వచ్చిన ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  ‘కొండపొలం' చూసిన చిరంజీవి

  ‘కొండపొలం' చూసిన చిరంజీవి

  ఎన్నో అంచనాల నడుమ 'కొండపొలం' మూవీ నేడు (అక్టోబర్ 8) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే గురువారం రాత్రే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కోసం ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఇందులో ఆయన తన భార్య సురేఖతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

  ‘కొండపొలం'పై చిరంజీవి రివ్యూ

  ‘కొండపొలం'పై చిరంజీవి రివ్యూ

  స్పెషల్ స్క్రీనింగ్‌లో 'కొండపొలం' సినిమాను వీక్షించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌ను అభినందించారు. సున్నితమైన కథను అద్భుతంగా తెరకెక్కించాడంటూ క్రిష్‌నే ప్రశంసలతో ముంచెత్తిన ఆయన.. తన మేనల్లుడిని నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే, మిగిలిన వాళ్లందరికీ అభినందలను తెలుపుతూ.. ఆల్ ది బెస్ట్ చెప్పేశారు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  ఒక్క ట్వీట్‌తో మొత్తం రివీల్ చేసేసి

  'కొండపొలం' మూవీపై చిరంజీవి 'అద్భుతమైన గ్రామీణ ప్రేమకథను శక్తివంతమైన సందేశంతో తెరకెక్కించారు. క్రిష్ ఎప్పుడూ సంక్లిష్టమైన కథాంశాలను టచ్ చేస్తూనే పలు సమస్యలను ప్రస్తావిస్తుంటాడు. అలాగే, కళాకారుల నుంచి ఉత్తమమైన నటనను రాబడతాడు. ఈ చిత్రం అవార్డులు, రివార్డులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది' అని ట్వీట్ చేశారు.

   ముందుగానే కంగ్రాట్స్ చెప్పిన చిరు

  ముందుగానే కంగ్రాట్స్ చెప్పిన చిరు

  సినిమా చూసిన తర్వాత ఎంతో ఆనందంగా కనిపించిన చిరంజీవి మరో ట్వీట్ కూడా చేశారు. అందులో 'క్రిష్ జాగర్లమూడి, పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కీరవాణి గారితో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. ఇది కచ్చితంగా మీ కెరీర్‌లలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్' అని పేర్కొన్నారు. దీంతో చిత్ర యూనిట్‌లో జోష్ కనిపిస్తోంది.

  English summary
  Vaishnav Tej Recently Did Kondapolam Movie Under Krish Jagarlamudi Direction. Megastar Chiranjeevi Watched This Movie Last Night and Tweet on This. మె
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X