For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు గంటలు సముద్ర అడుగుభాగంలో.. సైరా కోసం తెగించిన చిరంజీవి

|

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత కథను తెరకెక్కించడానికి 12 ఏళ్లు వేచి చూశానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా చిత్రం అక్టోబర్ 2న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ముంబైలో మంగళవారం అట్టహాసంగా హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. 63 ఏళ్ల వయసులో కళ్లుచెదిరేలా ఉన్న యాక్షన్ సీన్లలో నటించడం గురించి వివరంగా తెలిపారు.

ఓసారి మేకప్, క్యాస్టూమ్స్ వేసుకొంటే

ఓసారి మేకప్, క్యాస్టూమ్స్ వేసుకొంటే

సైరా షూటింగ్‌కు ప్రతీ రోజు వెళ్లే వాడిని కాదు. కానీ రెండు రోజులకోసారి మాత్రం ఏం జరుగుతున్నదనే విషయాన్ని తెలుసుకొనే వాడిని. ఒకసారి నేను క్యాస్టూమ్స్ వేసుకొంటే లేదా మేకప్ వేసుకొంటే నేను పాత్రలోకి మారిపోతాను. నన్ను నేను మరిచిపోతాను. ఒకసారి నేను వద్దనుకొంటే నన్ను ఆపేవారు ఎవరూ ఉండేవాళ్లు కాదు. ఏ సీన్‌నైనా పండించడానికి వందశాతం ఎఫర్ట్‌ను పెట్టాను అని చిరంజీవి చెప్పారు.

63 ఏళ్ల వయసులో కూడా

63 ఏళ్ల వయసులో కూడా

నా 63 ఏళ్ల వయసు. ఇప్పుడు కూడా యాక్షన్ సీన్లు గానీ, పాటలలకు గానీ కావాల్సిన ఎనర్జీ దానంతట అదే వచ్చేస్తుంది. అలాంటి సన్నివేశాలు చేయడానికి ఉత్సాహం పొంగుకు వచ్చేస్తుంటుంది. 150 చిత్రం ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చినప్పుడు నా మూడ్, బాడీ లాంగ్వేజ్, ప్రతీ ఒక్కటి మారిపొయిందనే విషయాన్ని నా భార్య సురేఖ గమనించింది అని చిరంజీవి చెప్పారు.

 నా భార్య ప్రోత్సాహం అలా..

నా భార్య ప్రోత్సాహం అలా..

నేను ఓసారి సెట్స్‌లోకి అడుగుపెడితే ఇది నా ప్రపంచం అని భావిస్తాను. నా ఉత్సాహం చూసినప్పుడల్లా నా భార్య నీవు సినిమా ఇండస్ట్రీలోనే ఉండు. అక్కడే నీకు సంతోషం.. సౌలభ్యం లభిస్తుందని అంటుంది. డైరెక్టర్ ఏదైనా అడిగితే నో చెప్పడం తెలియదు. ఎందుకంటే వారికి నేను ఏం చేయగలనో.. ఏం చేయలేనో వారికి కచ్చితంగా తెలుస్తుంది అని చిరంజీవి వెల్లడించారు.

రెండు గంటలపాటు సముద్ర గర్భంలో

రెండు గంటలపాటు సముద్ర గర్భంలో

నేను నటనను దైవసమానంగా భావిస్తాను. ఒకరోజు అండర్ వాటర్ (సముద్రం అడుగుభాగంలో) షూట్ చేయాలి. ఉదయం 10 గంటలకు ముంబైకు చేరుకొన్నాను. 11.30 గంటలకల్లా మేకప్‌తో రెడీ అయ్యాను. రెండు గంటల్లోనే షూట్ ముగించాం. 3.30 కల్లా షూటింగ్ ముగించుకొని ఫ్లయిట్‌లో ఇంటికి బయలుదేరాను అని చిరంజీవి చెప్పారు.

నర్సింహారెడ్డి స్ఫూర్తి కారణంగానే

నర్సింహారెడ్డి స్ఫూర్తి కారణంగానే

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి స్ఫూర్తి వల్లనే ఈ వయసులో మా నాన్న యాక్షన్ సీన్లను అద్భుతంగా పోషించాడు అని రాంచరణ్ వెల్లడించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రాంచరణ్ నిర్మాతగా నిర్మించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం పలు భారతీయ భాషల్లో రూపొందింది. 1850 నాటి కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్నది.

English summary
Sye Raa Narasimha Reddy teaser launch: Mega star Chiranjeevi's Sye Raa Narasimha Reddy teaser launch happend in Mumbai on Tuesday (August 20). Chiranjeevi, Nayanthara, Ram Charan, Tammannah Bhatia, Surender Reddy are attended this fuction. In this event, Chiranjeevi speaks to media. He said, There's an underwater sequence (in Sye Raa) and they had planned it for 2 days. I landed at 10 AM in Mumbai and by 11:30 AM, I was ready with my makeup. Within two hours, we finished everything. By 3:30 PM, I took my flight back home."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more