చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఖరారయ్యాడోచ్!

By Bojja Kumar

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే చర్చ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే. 150వ సినిమా కావడం, రాజకీయాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత కొంతకాలంగా కథ గురించి చాలా అన్వేషణ జరిగింది. బెస్ట్ స్టోరీ కోసం చాలా కథలు పరిశీలించారు.

చిరంజీవి సినిమా అంటే ఆశామాషీ విషయం కాదు. సత్తా ఉన్న దర్శకుడు కావాలి. అందుకే దర్శకుల విషయంలోనూ మల్లగుల్లాలు పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీను పైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల బోయపాటి బాలయ్యతో 'లెజెండ్' సినిమా తెరకెక్కించి తన సత్తా నిరూపించుకున్నాడు.

బాలయ్య పొలిటికల్‌గా ఎదగడానికి 'లెజెండ్' సినిమా కూడా కొంత సహకరించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి 150వ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం అయితేనే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా

చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా

చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఫ్యాన్స్ హ్యాపీ

ఫ్యాన్స్ హ్యాపీ

చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

అన్ని అంశాలతో 150వ సినిమా

అన్ని అంశాలతో 150వ సినిమా

చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుట్టిన రోజు కానుకా?

పుట్టిన రోజు కానుకా?

ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X