చిరంజీవితో చేయలేమంటున్నారు
తన 150 వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడంటూ, ఇటీవల అమితాబ్ సమక్షంలో 'బుడ్డా' సినిమా ప్రీమియర్ సందర్భంలో, చిరంజీవి ఎంతో ఎమోషనల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడప్పుడే ఆ సినిమా ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనపడటం లేదు.ముఖ్యంగా చిరంజీవికి ఏ కధా నచ్చకపోవటమే ప్రధానాంశం అంటున్నారు.ఆయన తన ప్రతీ సినిమా ఠాగూర్,స్టాలిన్ లాగ ఉండాలి..అటు కమర్షియల్ విలువలు మిస్ కాకూడదు,ఇటు జనాలికి సందేశాలు ఇచ్చేయాలి అని చెప్పుతున్నారని తెలుస్తోంది.దాంతో ఆయన వద్దకు కథ పట్టుకు వెళ్ళిన ప్రతీవారు ఆయన చెప్పే మార్పులు చెయ్యలేక,ఆయనని ఒప్పించలేక వెనక్కి వస్తున్నారు.
నిజానికి అధినాయకుడు టైటిల్ తో చిరంజీవి హీరోగా పరుచూరి బ్రదర్స్ మొదట స్క్రిప్టు వండటంతో ఈ గేమ్ స్టార్టయింది.ఆ తర్వాత రకరకాల లైన్స్ మారాయి కానీ కథ మాత్రం ఓకే కాలేదు.దాంతో వారు విరక్తి చెంది వెనక్కి వచ్చేసారు.మరో ప్రక్క వినాయిక్ సైతం ఓ లైన్ వినిపిస్తే..దానికి సందేశం కలపమనటంతో అతనూ మాట్లాడకుండా అలాగే అని తల ఊపేసి సైలెంట్ అయ్యిపోయానడి తెలుస్తోంది.ఇక పూరీ అయితే నాది పక్కా కమర్షియల్ ఫార్మెట్ అని తేల్చిచెప్పి,బుడ్డాలాంటి సినిమా ప్లాన్ చేద్దామని ప్రపోజల్ పెట్టాడని,అయితే చిరంజీవి దానిపై ఆసక్తి చూపకపోవటంతో తన నెక్స్ట్ ప్రాజెక్టులలో పూరీ బిజీ అయిపోయారని వినిపిసిస్తోంది.మరి వినాయిక్ చేయక,పూరీ చేయక,మరెవరు చిరంజీవి సినిమాని తలకెక్కుకుంటారు అంటే సమాధానం లేదు.
ఇదిలా ఉంచితే, తనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవి, అది రాకపోవడంతో బాగా అప్సెట్ అయ్యారనీ, ప్రస్తుతం ఆయనకు సినిమాల పట్ల కూడా ఆసక్తి లేదనీ ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











