twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టించిన ఆచార్య మూవీ.. దేశ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. చిరంజీవి మూవీకే ఘనత

    |

    మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆచార్య మూవీ షూటింగ్ స్థాయిలో ఉండగానే రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. లాక్‌డౌన్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం ఎలాంటి విశేషాలను సంతరించుకొన్నదంటే...

     దేవుడు మాన్యాల కథా నేపథ్యంగా

    దేవుడు మాన్యాల కథా నేపథ్యంగా

    సైరా చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం దేవుడి మాన్యాల కథా నేపథ్యంగా సాగుతుందనే ప్రచారం జరుగుతున్నది. దేవాలయాలకు సంబంధించిన భూముల నేపథ్యంలో సాగే అవినీతి అక్రమాలను ఎదురించే పాత్రలో చిరంజీవి కనిపిస్తారనేది తాజా సమాచారం.

    వివాదం నుంచి బయటపడి

    వివాదం నుంచి బయటపడి

    ఇటీవల ఆచార్య సినిమా కథ తనదే అంటూ ఓ రచయిత మీడియాకు ఎక్కడంతో గందరగోళం నెలకొన్నది. మీడియాలో ముఖాముఖిగా రచయిత, దర్శకుడు కొరటాల శివ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఆ వివాదం సద్దుమణిగించింది. ఈ క్రమంలో లాక్‌డౌన్ తర్వాత షూటింగలకు అనుమతి ఇవ్వడంతో శరవేగంగా షూటింగు జరుగుతున్నది.

     20 కోట్లతో 20 ఎకరాల్లో

    20 కోట్లతో 20 ఎకరాల్లో


    ఆచార్య సినిమా కోసం వేసిన సెట్ ప్రస్తుతం ఓ రికార్డుగా మారింది. దేశ చరిత్రలోనే గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సెట్‌ను వేసినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రూ.20 కోట్లతో సుమారు 20 ఎకరాల్లో సెట్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సెట్‌లోనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

     ఆలయ నగరి సెట్ నిర్మాణం

    ఆలయ నగరి సెట్ నిర్మాణం

    ఆచార్య సినిమా కోసం ఆలయ నగరి సెట్‌ను యూనిట్ నిర్మించింది. ఈ సెట్‌లోనే సినిమాకు సంబంధించిన ప్రధాన, మెజారిటీ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇలాంటి సెట్ వేయడం దేశ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు అని చిత్ర యూనిట్ వర్గాలు ధృవీకరించాయి.

     నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాంచరణ్, దివి వద్యా, సోనుసూద్ తదితరులు
    దర్శకత్వం: కొరటాల శివ
    మ్యూజిక్: మణిశర్మ
    సినిమాటోగ్రఫి: తిరు
    ఎడిటింగ్: నవీన్ నూలి
    ప్రొడక్షన్ కంపెనీ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
    రిలీజ్: 2021

    English summary
    Chiranjeevi's Acharya movie shoot going with positive note. For this movie, Temple town set in #Acharya - Biggest set ever created in India for a film. Majority of the film being shot in this set. Much awaited film aiming for May 2021 release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X