twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జయహో రుద్రమదేవి' గంభీరంగా చిరంజీవి (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :అనుష్క టైటిల్‌ పాత్రధారిగా గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై స్వీయ నిర్మాణంలో గుణశేఖర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా వాయిస్ ఎలా ఉంటుందో టేస్ట్ చూపించటానికి రామ్ చరణ్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా ముందుకు వచ్చాడు. 'జయహో రుద్రమదేవి' అంటూ చిరంజీవి గంభీరంగా వాయిస్‌ ఇచ్చారు. మీరు చూడండి ఇక్కడ....

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    We are happy Dad rendered his voice to #Rudhramadevi ..

    Posted by Ram Charan on 18 June 2015

    గుణశేఖర్‌ మాట్లాడుతూ... ‘‘భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ 3డి సినిమాగా ఎంతో భారీ వ్యయంతో తయారవుతున్న మా చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ కూడా పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్‌'కు అమితాబ్‌ బచ్చన్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఎంతటి ఎస్సెట్‌ అయ్యిందో, మా చిత్రానికి చిరంజీవిగారిచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుంది. అడగ్గానే అంగీకరించి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని చెప్పారు.

    గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్‌, ప్రకాశ్‌రాజ్‌, నిత్యా మీనన్‌, కేథరిన్‌ ట్రెసా, ప్రభ, జయప్రకాశ్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ప్రసాదాదిత్య, అజయ్‌, విజయ్‌కుమార్‌, వేణుమాధవ్‌, ఉత్తేజ్‌, వెన్నెల కిశోర్‌, కృష్ణభగవాన్‌, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, శివాజీరాజా తారాగణం. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

    Chiranjeevi's audio posted by Ramcharan

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా..అనుష్క, చాళుక్య వీరభద్రునిగా..రానా, గోనగన్నారెడ్డిగా..అల్లు అర్జున్, గణపతిదేవునిగా..కృష్ణంరాజు, శివదేవయ్యగా..ప్రకాష్ రాజ్, హరిహరదేవునిగా..సుమన్, మురారిదేవునిగా..ఆదిత్యమీనన్, నాగదేవునిగా..బాబా సెహగల్, కన్నాంబికగా..నటాలియాకౌర్, ముమ్మడమ్మగా..‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా..హంసానందిని, అంబదేవునిగా..జయప్రకాష్రెడ్డి, గణపాంబగా..అదితి చంగప్ప, కోటారెడ్డిగా..ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా..అజయ్ కనిపించనున్నారు. వీరితో పాటు నిత్యామీనన్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    Chiranjeevi's audio posted by Ramcharan

    ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సీతారామశాస్త్రి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, కళ: తోట తరణి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కె. రామ్‌గోపాల్‌, సమర్పణ: రాగిణీ గుణ, కథ, స్ర్కీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్‌.

    English summary
    Ram Charan posted a video " We are happy Dad rendered his voice to #Rudhramadevi .."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X