బేబీ 2 లోడింగ్: త్వరలో తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతకాబోతున్నారు. త్వరలో ఆయన చిన్న కూతురు శ్రీజ మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు అఫీషియల్‌గా వెల్లడించారు. తాను తండ్రి కాబోతున్నాను అనే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
కళ్యాణ్ దేవ్ తాను తండ్రి కాబోతున్న విషయాన్ని వెల్లడిస్తూ చేసిన ఫేస్ బుక్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ తన ఎగ్జైట్మెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు.
హ్యాపీ కపుల్
శ్రీజ, కళ్యాణ్ వివాహం 2016, మార్చి 28న జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరులోని మెగా ఫ్యామిలీ గెస్ట్ హౌస్‌లో చిరంజీవి తన స్థాయికి తగిన విధంగా వైభవంగా ఈ వివాహ వేడుక నిర్వహించారు.

ఆ బిడ్డను కూడా తన బిడ్డగానే
శ్రీజకు గతంలో శిరీష్ భరద్వాజ్‌తో వివాహం జరుగడం, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు జరుగడం తెలిసిందే. అయితే ఆ బిడ్డను కూడా తన బిడ్డగానే స్వీకరించి శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.

కళ్యాణ్ దేవ్
కళ్యాణ్ దేవ్, శ్రీజ పెళ్లికి ముందు నుంచే స్నేహితులు. విడాకుల తర్వాత కొంతకాలం పాటు శ్రీజ విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలోనే కళ్యాణ్‌తో అనుబంధం మరింత పెరిగింది. కళ్యాణ్ దేవ్ యూఎస్ఏ బేస్డ్ జ్యువెల్లరీ వ్యాపారి కెప్టెన్ కిషన్ కుమారుడు.

మెగా ఫ్యామిలీ హీరోల్లో కళ్యాణ్
కళ్యాణ్ దేవ్ సైతం నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ‘విజేత' అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. దీని తర్వాత కళ్యాణ్ ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదు.


Click it and Unblock the Notifications











