చిరంజీవి హాలీవుడ్ రేంజ్ డ్రీమ్ ప్రాజెక్ట్
మెగాస్టార్‌గా తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన చిరంజీవి కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. అయితే చిరంజీవికి ఇప్పటికీ ఓ కల కలగానే మిగిలి పోయింది. అది తీరకుండానే ఆయన సినిమాలకు దాదాపుగా దూరం అయ్యారు. అది హాలీవుడ్లో నటించాలనే కోరిక కాదు కానీ....హాలీవుడ్ రేంజిలో ఓ తెలుగు సినిమాలో నటించాలనేది ఆయన డ్రీమంట.
చిరంజీవికి ఆ ఆలోచన వచ్చినప్పుడు 'కొదమ సింహం' షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత 'అబు బగ్దాద్ గజదొంగ' అనే టైటిల్ పేరుతో ఓ చిత్రాన్ని హాలీవుడ్ రేంజిలో చేయాలనుకున్నారట. అయితే ఈ సినిమా స్ట్రిప్టులో ఓ మతం వారికి ఇబ్బంది కలిగించే అభ్యంతరాలు ఉండటం, ఈ విషయం లీకయి సదరు మత సంస్థకు తెలియడం, ఆ సంస్థవారు ఆగ్రహం వ్యక్తం చేయడం...ఈ పరిణామాల నేపథ్యంలో ఆ చిత్రం చిత్రీకరణకు నోచుకోకుండానే రద్దయి పోయింది. ఈ ఘటన జరిగి దాదాపు 20 సంవత్సరాలవుతోంది.
తాజాగా తండ్రి డ్రీమ్ ప్రాజెక్టు తెరకెక్కించాలని చూస్తున్నాడు ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చిరంజీవిని అందులో మెయిన్ లీడ్‌గా పెట్టి స్వయంగా ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు చరణ్. ఇలా చేయడం ద్వారా హాలీవుడ్ రేంజిలో సినిమా చేయాలనే చిరంజీవి డ్రీమ్‌తో పాటు తండ్రి 150 చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలనే చరణ్ కోరిక కూడా తీరుతుందని, అందుకే చరణ్ దీనిపై అమితాసక్తి చూపుతున్నాడని చర్చించుకుంటున్నారు. మరి చిరంజీవి డ్రీమ్..చరణ్ కోరిక ఎప్పుడు పూర్తవుతుందో..?


Click it and Unblock the Notifications











