చిరంజీవి డూప్ మృతి..నాగబాబు సంతాపం
గుంటూరు : జూనియర్ నటుడు (చిరంజీవి డూప్) బండ్లమూడి దిలీప్‌కుమార్ (42) హఠాన్మారణం చెందారు. గుంటూరు రైలుపేట 1/1వ అడ్డరోడ్డులో నివాసం ఉంటున్న దిలీప్‌కుమార్ బుధవారం రాత్రి గుండెనొప్పితో బాధ పడుతుండగా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కొత్తపేట గౌరీశంకర్ థియేటర్ వీధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దిలీప్‌కుమార్ ఎన్‌టిఆర్ నగర్, ఆంధ్రా అందగాళ్లు, వన్స్‌మోర్ ప్లీజ్, అమృతం, భలేఛాన్సులే తదితర సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో చిరంజీవి డూప్‌గా నటించారు. ఆయన మృతిపట్ల సినీనటుడు నాగబాబు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిరంజీవి యువత నగర అధ్యక్షుడు గిడుతూరి సత్యం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బ్రహ్మనాయుడు, రాజమండ్రి, వైజాగ్, తాడేపల్లిగూడెం, హైదరాబాద్ నుంచి కళాకారులు రైలుపేటలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.


Click it and Unblock the Notifications












