మొత్తానికి చిరంజీవి మేనల్లుడు పూర్తి చేసాడు
మెగాస్టర్ చిరంజీవి మేనల్లుడు విశ్వతేజ హీరోగా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలైన 'హ్యాపీ జర్నీ' విడుదలకు రెడీ అయింది. జనవరి 2011 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితాన్ని కోరుకొంటారు. అందుకోసమే నిరంతరం ఆరాటపడుతుంటారు. ఆ ప్రయాణంలో మనిషి కోల్పోతున్న అనుభూతులేమిటో ఎవరికీ అర్థం కావట్లేదు. సుఖమయ జీవితం కోసం సగటు మనిషి చేయాల్సిందేమిటో మా చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇది రెండు తరాల కథ. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకొనేలా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభించింది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ 'హ్యాపీజర్నీ' చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.
ఈ చిత్రంలో మధుశాలినీ, రేష్మి హీరోయిన్స్ గా చేస్తున్నారు. పందెం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సభాపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్ర కథ ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో సుఖసంతోషాలను అనుభవంచాలని జీవితంలో పూర్తిగా మునిగిపోయి మానవసంభంధాలను విస్మరిస్తారని...దాన్ని వెలికి చెప్పటమే తమ లక్ష్యమంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: వైభవ్ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సతీష్, ఉమ, ఛాయాగ్రహణం: ఎన్.సుధాకర్ రెడ్డి, బి.రామ్ కుమార్, సంగీతం: నందన్ రాజ్, నరేన్-భరద్వాజ్, కూర్పు: బి.కృష్ణారెడ్డి.


Click it and Unblock the Notifications











