twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడు అన్యాయం చేశాడు, అదే ఆఖరి చూపు: శ్రీదేవి మరణంపై చిరంజీవి ఎమోషనల్‌గా...

    By Bojja Kumar
    |

    Recommended Video

    శ్రీదేవి మరణంపై చిరంజీవి స్పందన...అదే ఆఖరి చూపు...!

    శ్రీదేవి మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమెతో చేసిన సినిమాలు, ఆమె గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు. తన సహచర నటి మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు.

    భగవంతుడు అన్యాయం చేశాడు

    భగవంతుడు అన్యాయం చేశాడు

    ‘అందం, అభినయం కలగలిపిన అత్యధ్భుత నటి శ్రీదేవి . అలాంటి నటీమణి అంతకు ముందు లేదు. భవిష్యత్తులో కూడా వస్తారని అనుకోను. మా అతిలోక సుందరి ఈ రకంగా అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే మింగుడు పడని చేదు నిజం. భగవంతుడు చాలా అన్యాయం చేశాడు.' అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

    శ్రీదేవిని చూసి చాలా నేర్చుకున్నాను

    శ్రీదేవిని చూసి చాలా నేర్చుకున్నాను

    ఇంత చిన్న వయసులో శ్రీదేవి ఈ రకంగా హఠాన్మరణం పొందడం అనేది జీర్ణించుకోలేక పోతున్నాను. శ్రీదేవికి చిన్నప్పటి నుండి నటన తప్ప మరొకటి తెలియదు. మరో ధ్యాస లేదు, మరో వ్యాపకం లేదు. ఎంతసేపూ నటన నటన అని ఉండేవారు. అలాంటి నటీమణులను మనం ఎప్పుడూ చూడలేం. అది ఒక శ్రీదేవిలోనే చూశాను. ఆమె అంకిత భావం చూసి చాలా నేర్చుకున్నాను. ఎంతో ఇన్స్ స్పైర్ అయ్యాను.... అని చిరంజీవి అన్నారు.

    జగదేక వీరుడు, అతిలోక సుందరి

    జగదేక వీరుడు, అతిలోక సుందరి

    నా కెరీర్ బిగినింగులో రాణికాసు రంగమ్మ అనే సినిమా చేశాను. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా మా కాంబినేషన్లో వచ్చిన అత్యద్భుతమైన దృశ్య కావ్యం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి'... ఆమె అందులో దేవత పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా? ఆవిడ కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా అన్నట్లుగా తెరమీద అద్భుతంగా కనిపించారు. శ్రీదేవి నటన చూసిన తర్వాత ఎంతలా ఇన్స్ స్పైర్ అయ్యానంటే మాటల్లో చెప్పలేను. తర్వాత ఆమెతో చేసిన ఆఖరి సినిమా ఎస్పీ పరుశురాం.... అని చిరంజీవి తెలిపారు.

    ఆమెను చూడటం అదే ఆఖరు సారి

    ఆమెను చూడటం అదే ఆఖరు సారి

    ఇరు కుటుంబాల్లో ఏవైనా ఫంక్షన్లు జరిగితే ఒకరినొకరు ఆహ్వానించుకోవడం చేస్తుంటాం. నా 60వ జన్మదినం రోజున బోనీకపూర్‌-శ్రీదేవి దంపతులు వచ్చి ఆశీర్వదించారు. ఆమెను ప్రత్యక్షంగా చూడటం అదే ఆఖరిసారి.

    సినీ పరిశ్రమ దురదృష్టం

    సినీ పరిశ్రమ దురదృష్టం

    ఉదయం శ్రీదేవి చనిపోయిందని విని చాలాసేపు నేను నమ్మలేదు. ఆమె మరణం భారతీయ పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శ్రీదేవి భౌతికంగా మనమధ్య లేకపోయినా ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. సినీ రంగం ఉన్నంతవరకు ఆమె జీవించే ఉంటుంది' అని చిరంజీవి అన్నారు.

    English summary
    Chiranjeevi's response to Sridevi's death News. Having a career which expanded for over four decades, Bollywood's Veteran actress Sridevi passed away at the age of 54. The actor, wife of producer Boney Kapoor, died late in the night reportedly due to cardiac arrest in Dubai, where she had gone along with her family to attend her nephew Mohit Marwah's wedding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X